AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్టీసీలో అదిరిపోయే స్టెప్..కెసీఆర్ యాక్షన్ షురూ !

25 రోజులుగా తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ.. కొనసాగస్తున్న ఆర్టీసీ సమ్మెలో కార్మిక సంఘాలకు దిమ్మతిరిగిపోయే యాక్షన్ ప్లాన్‌కు కెసీఆర్ శ్రీకారం చుట్టారు. సంస్థను ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కనీయకుండా.. సమయం సందర్భం లేకుండా సమ్మెలు చేస్తున్న కార్మికుల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేమని.. తీరిస్తే సంస్థ మరింతగా నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి వుందని భావించిన ముఖ్యమంత్రి కెసీఆర్.. తనదైన శైలిలో చర్యలకు ఉపక్రమించారు. మంగళవారం నుంచి కెసీఆర్ కొత్త యాక్షన్ ప్లాన్ అమలు షురువైంది. కార్పొరేషన్‌కు చెందిన […]

ఆర్టీసీలో అదిరిపోయే స్టెప్..కెసీఆర్ యాక్షన్ షురూ !
Rajesh Sharma
|

Updated on: Oct 29, 2019 | 10:17 AM

Share

25 రోజులుగా తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ.. కొనసాగస్తున్న ఆర్టీసీ సమ్మెలో కార్మిక సంఘాలకు దిమ్మతిరిగిపోయే యాక్షన్ ప్లాన్‌కు కెసీఆర్ శ్రీకారం చుట్టారు. సంస్థను ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కనీయకుండా.. సమయం సందర్భం లేకుండా సమ్మెలు చేస్తున్న కార్మికుల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేమని.. తీరిస్తే సంస్థ మరింతగా నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి వుందని భావించిన ముఖ్యమంత్రి కెసీఆర్.. తనదైన శైలిలో చర్యలకు ఉపక్రమించారు.

మంగళవారం నుంచి కెసీఆర్ కొత్త యాక్షన్ ప్లాన్ అమలు షురువైంది. కార్పొరేషన్‌కు చెందిన బస్సులు, కార్మికులతో కొద్దిపాటు సర్వీసులను నడిపిస్తూనే.. ప్రైవేటు దిశగా అడుగులు వేయడం మొదలైంది. రాష్ట్రంలోని మొత్తం రూట్లలో ప్రధాన రూట్లలో బస్సులను తిప్పేందుకు ఉద్దేశించి.. ప్రైవేటు ఆపరేటర్లను నుంచి టెండర్లను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయించారు. మొత్తం తెలంగాణవ్యాప్తంగా 3 నుంచి 4 వేల రూట్లను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని కెసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించడమే తరువాయి అంటున్నారు. ముసాయిదా సిద్దం కాగానే తెలంగాణ కేబినెట్ భేటీ నిర్వహించి ఈ ప్రతిపాదనను ఆమోదించబోతున్నట్లు సమాచారం.

అద్దె బస్సుల కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌కు భారీగానే స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. వెయ్యి బస్సుల కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తే.. 21 వేల 453 అప్లికేషన్లు దాఖలయ్యాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రైవేటు ఆపరేటర్లు కూడా తెలంగాణలో బస్సులను తిప్పేందుకు ముందుకొ్చ్చినట్లు సమాచారం. అయితే.. 4 వేల బస్సులను అద్దెకు తీసుకుంటే తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రభావం అస్సలే కనిపించదని అధికారులు అంటున్నారు. ఆ తర్వాత ఇపుడు నడుస్తున్న ఆర్టీసీ బస్సుల సంఖ్యను కూడా తగ్గిస్తామని చెబుతున్నారు వారు.

భారీగా వేతనాలు తీసుకుంటూ.. ఆర్టీసీని నిరర్ధక ఆస్తిగా మార్చిన కార్మికులు, సిబ్బంది గొంతెమ్మ కోర్కెలను నెరవేర్చకుడానే సంస్థను గట్టెక్కించాలని కెసీఆర్ భావిస్తున్నారు. సంస్థను 50శాతం ప్రైవేటుపరం చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధాన రహదారులపై సాగే దూర ప్రాంత సర్వీసులను ప్రైవేటు వారికిచ్చి.. గ్రామీణ ప్రాంతంలో మాత్రం ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్సులు నడపాలన్న భావన ముఖ్యమంత్రిలో వ్యక్తమవుతోందని ఆయన నిర్వహించే సమీక్షల్లో పాల్గొంటున్న అధికారులు సూత్రప్రాయంగా చెబుతున్నారు.