రైతు భరోసా కేంద్రాలపై గురుతర బాధ్యత.. జగన్ సంచలన నిర్ణయం

ఏపీలో వ్యవసాయదారులకు ఉపయోగపడేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్థాయిలోనే రైతులకు ఉపయోగపడే పలు చర్యలకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నట్లు సంకేతాల్నిచ్చారు.

  • Rajesh Sharma
  • Publish Date - 3:36 pm, Wed, 28 October 20
రైతు భరోసా కేంద్రాలపై గురుతర బాధ్యత.. జగన్ సంచలన నిర్ణయం

Crucial responsibility on Rytu Bharosa centre: ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన రైతు భరోసా కమిటీలపై పెద్ద బాధ్యత మోపబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆర్బీకేల పరిధిలో మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి బుధవారం ప్రకటించారు. అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ ప్రాజెక్ట్, ఇ–మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌పై సీఎం బుధవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రైతాంగానికి ఉపయోగపడే పలు నిర్ణయాలు తీసుకున్నారు.

‘‘ పంటను అమ్ముకోవడానికి రైతు ఇబ్బంది పడకూడదు.. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి.. ప్రత్యామ్నాయ మార్కెట్లు చూపాలి లేకపోతే వెంటనే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. వ్యవసాయశాఖమంత్రి, సంబంధిత అధికారులు ప్రతిరోజూ సమీక్ష చేయాలి.. రైతులకు అందుతున్న కనీస మద్దతు ధరలు, కొనుగోళ్లపై ప్రతిరోజూ సమీక్ష చేయాలి.. సీఎం యాప్‌ ద్వారా అందుతున్న డేటాపై డిస్కస్‌ చేయాలి.. వెంటనే చర్యలు తీసుకోవాలి… ’’ అని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ఆర్బీకేల పరిధిలో మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తే.. సుమారు రూ. 9093 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేస్తోంది ప్రభుత్వం. గోడౌన్లు, కోల్డ్‌ రూమ్స్, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్, ఆక్వా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆర్బీకే పరిధిలో వ్యవసాయ యంత్రపరికరాలు, మండలాల పరిధిలో వ్యవసాయ యంత్ర పరికరాలు, ప్రొక్యూర్‌ మెంట్‌ సెంటర్లు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, ఆక్వాబజార్, ప్రి ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, ఇ–మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫాంలతో మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు నడపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Also read: ఇళ్ళను ఆక్రమించుకుంటాం… టీడీపీ నేతల హెచ్చరిక

Also read: కొత్త సచివాలయ నిర్మాణానికి ‘సుప్రీం‘ ఓకే

Also read: పోతుల సునీత షాకింగ్ డెసిషన్