కోవాక్సిన్‌లో అదనపు ఔషధం..అదే కీలకం!

కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళిస్తున్న నేపథ్యంలో వాక్సిన్ రూపకల్పనలో నిమగ్నమైన భారత్ బయోటెక్ అత్యంత కీలకమైన విషయాన్ని వెల్లడించింది. తాము ట్రయల్స్ నిర్వహిస్తున్న కోవాగ్జిన్...

కోవాక్సిన్‌లో అదనపు ఔషధం..అదే కీలకం!
Follow us

|

Updated on: Oct 05, 2020 | 3:56 PM

Crucial medicine in Corona vaccine: కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళిస్తున్న నేపథ్యంలో వాక్సిన్ రూపకల్పనలో నిమగ్నమైన భారత్ బయోటెక్ అత్యంత కీలకమైన విషయాన్ని వెల్లడించింది. తాము ట్రయల్స్ నిర్వహిస్తున్న కోవాగ్జిన్ – కరోనా వాక్సిన్‌లో వినియోగిస్తున్న కీలక ఔషధం పేరును వెల్లడించింది భారత్ బయోటెక్ సంస్థ. ఈ ఔషధం కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగి కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్లా కృష్ణ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు పలు సంస్థలు వాక్సిన్ రూపొందించడంపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ బయోటెక్ కోవాగ్జిన్ అనే వాక్సిన్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ వాక్సిన్ ప్రయోగాలు ప్రస్తుతం రెండో దశలో వున్నాయి. తొలి దశను సక్సెస్‌ఫుల్‌గా అధిగమించిన భారత్ బయోటెక్ రెండో దశలో వినియోగిస్తున్న ఔషధం వివరాలు వెల్లడించింది. ‘‘అల్ హైడ్రాక్సిక్విమ్-2’’ అనే అనుబంధ ఔషధాన్ని వాక్సిన్ పరిశోధనల్లో వినియోగిస్తున్నట్లు తెలిపింది.

దీని వల్ల మరింత మెరుగైన రోగనిరోధక శక్తి లభించడంతోపాటు వైరస్‌తో దీర్ఘకాలం పోరాడే రక్షణ శరీరానికి లభిస్తుందని భారత్ బయోటెక్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక అనుబంధ ఔషధాన్ని వైరో వాక్స్ అనే సంస్థ తమకు అందిస్తుందని, ఈ మేరకు తమతో వైరో వాక్స్ ఒప్పందం కుదుర్చుకుందని వారంటున్నారు. ‘‘అల్ హైడ్రాక్సిక్విమ్-2’’ వినియోగంతో మరింత ఆశాజనక ఫలితాలు కనిపించాయని భారత్ బయోటెక్ ఎండీ ప్రకటించారు. దీని వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయనంటున్నారు.

కోవాగ్జిన్ పరిశోధన ప్రస్తుతం రెండో దశలో కొనసాగుతోందని, త్వరలోనే రెండో దశ ఫలితాలను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు నివేదించి, మూడో దశ ప్రయోగాలు ప్రారంభిస్తామని భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. మరోవైపు వాక్సిన్ చేతికందిన వెంటనే ప్రజల్లో పంపిణీ చేసేందుకు కావాల్సిన కార్యాచరణపై కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

Also read: కాంగ్రెస్ గూటికి చెరుకు ఫ్యామిలీ..! దుబ్బాకే టార్గెట్