‘పౌరోహిత్యాన్ని కులవ్రృత్తిగా గుర్తించండి’

కరోనా వేళ బ్రాహ్మణులు తీవ్ర వెతలు అనుభవిస్తున్నారని బ్రాహ్మణ సంఘాలు ఏపీ ప్రభుత్వానికి విన్నవించాయి. ఆలయాలు మూతపడటం దగ్గర్నుంచి.. వివాహాలు సహా అన్ని కార్యక్రమాలూ ఆగిపోవటంతో వీటిపై ఆధారపడ్డ బ్రాహ్మణులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘం నేతలు తెలిపారు. చేసేందుకు పనిలేక ఆకలితో పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయని వెల్లడించారు. ఇలాంటి సమయంలో ఎపి ప్రభుత్వం అర్చకులకు ఐదువేల రూపాయలు ఆర్ధిక సహాయం చేసి ఆదుకుందన్నారు. ఇదే క్రమంలో తాము ఎప్పటినుంచో కోరుతున్న పౌరోహిత్యాన్ని […]

'పౌరోహిత్యాన్ని కులవ్రృత్తిగా గుర్తించండి'
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 05, 2020 | 3:30 PM

కరోనా వేళ బ్రాహ్మణులు తీవ్ర వెతలు అనుభవిస్తున్నారని బ్రాహ్మణ సంఘాలు ఏపీ ప్రభుత్వానికి విన్నవించాయి. ఆలయాలు మూతపడటం దగ్గర్నుంచి.. వివాహాలు సహా అన్ని కార్యక్రమాలూ ఆగిపోవటంతో వీటిపై ఆధారపడ్డ బ్రాహ్మణులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘం నేతలు తెలిపారు. చేసేందుకు పనిలేక ఆకలితో పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయని వెల్లడించారు. ఇలాంటి సమయంలో ఎపి ప్రభుత్వం అర్చకులకు ఐదువేల రూపాయలు ఆర్ధిక సహాయం చేసి ఆదుకుందన్నారు. ఇదే క్రమంలో తాము ఎప్పటినుంచో కోరుతున్న పౌరోహిత్యాన్ని కులవ్రృత్తిగా గుర్తించాలనే డిమాండ్ ను నెరవేర్చాలని బ్రహ్మణ సంఘ నేతలు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ర్యాలీ తీసి జగన్ సర్కారుని అభ్యర్థించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకోవాలని ఎపి బ్రాహ్మణ సేవా సంఘాల సమైఖ్య రాష్ట్ర అధ్యక్షులు దుర్గాప్రసాద్, ఇతర నేతలు, పలువురు అర్చకులు డిమాండ్ చేశారు.