రేపట్నుంచి జూ పార్క్‌ ఓపెన్‌, టికెట్ల కోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌

కరోనా వైరస్‌ కారణంగా కకావికలమైన జనజీవనం ఇప్పుడిప్పుడే సర్దుకుంటోంది.. అన్‌లాక్‌ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి..

రేపట్నుంచి జూ పార్క్‌ ఓపెన్‌, టికెట్ల కోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌
Follow us

|

Updated on: Oct 05, 2020 | 3:27 PM

కరోనా వైరస్‌ కారణంగా కకావికలమైన జనజీవనం ఇప్పుడిప్పుడే సర్దుకుంటోంది.. అన్‌లాక్‌ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.. ఈ నేపథ్యంలో నెహ్రూ జులాజికల్‌ పార్క్‌ కూడా రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది.. అన్‌లాక్‌ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జంతు ప్రదర్శనశాలలోకి ప్రేక్షకులను అనుమతిస్తున్నారు.. ఇందుకోసం జూలోని అన్ని జంతువుల ఎన్‌క్లోజర్‌ దగ్గర ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బ్లీచింగ్‌ పౌడర్‌తో పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నారు. జంతు ప్రదర్శనశాలలోని ప్రతి ప్రాంతాన్ని శానిటైజ్‌ చేస్తున్నారు.. పిల్లలు ఎంతో ముచ్చటపడే టాయ్ రైలు, బ్యాట‌రీ వాహ‌నాల‌ను కూడా సిద్దం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 15న బంద్‌ అయిన జూపార్క్‌ మళ్లీ ఇన్నాళ్లకు తెరచుకుంటోంది.. ఇక ఇక్కడ కూడా కోవిడ్‌ నిబంధనలను అమలు చేస్తున్నారు.. పది ఏళ్లలోపు పిల్లలు, అరవై ఏళ్లు దాటిన వృద్ధులకు అనుమతి ఉండదు.. జంతు ప్రదర్శనశాలకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్‌ పెట్టుకోవాలి.. మాస్క్‌ లేనివారిని లోపలికి రానివ్వరు..వచ్చినవారందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతే జూపార్క్‌లోకి అనుమతిస్తారు. వంద డిగ్రీల కంటే ఎక్కువ శరీర ఉష్ణోగ్రతలున్నా అనుమతించరు. గుంపులు గుంపులుగా కాకుండా ప్రతి ఒక్కరూ ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి. సందర్శకులు ఎప్పటిలాగే తమ వెంట ఆహారపదార్థాలను తీసుకురావచ్చు కానీ.. నిర్దేశిత ప్రాంతాల్లోనే వాటిని తినాలి. టికెట్‌ కౌంటర్లు, ప్రవేశద్వారం, నిర్గమనద్వారం, టాయిలెట్ల దగ్గర శానిటైజర్‌లను అందుబాటులో పెడుతున్నారు.. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా శానిటటైజ్‌ చేసుకోవాలి. బ్యాటరీ ఆపరేటెడ్‌ వాహనాలల్లో 50శాతం సీట్లల్లోనే సందర్శకులను అనుమతిస్తారు. కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని కేటాయిస్తారు. అక్వేరియం, ఎన్‌కేహెచ్‌, ఫాజిల్‌ మ్యూజియం, నేచురల్‌హిస్టరీ మ్యూజియంలు ప్రస్తుతానికి మూసే ఉంచుతున్నారు. ఇక జూకు వెళ్లాలనుకునేవారు అక్కడికే వెళ్లి టికెట్లు తీసుకోవలసిన అవసరం లేదు ఇప్పుడు.. టికెట్‌ కౌంటర్‌ దగ్గర జనాలు గుమిగూడితే ప్రమాదం కాబట్టి ఇందుకోసం ఓ యాప్‌ను తయారుచేశారు జూ పార్క్‌ అధికారులు. ఈ యాప్‌లో జూకు సంబంధించిన సమస్త సమాచారం ఉంటుంది.. జూ పార్క్‌ అధికారిక వెబ్‌సైట్‌  www.nehruzoopark.in నుంచి కూడా టికెట్లు పొందవచ్చు.