Breaking: వైద్య శాస్త్రంలో ఈ ముగ్గురికి నోబెల్‌

ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారాల ప్రకటన ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో వైద్యశాస్త్రంలో మొదటగా నోబెల్ బహుమతిని ప్రకటించారు

Breaking: వైద్య శాస్త్రంలో ఈ ముగ్గురికి నోబెల్‌
Follow us

| Edited By:

Updated on: Oct 05, 2020 | 4:00 PM

Nobel medicine prize: ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారాల ప్రకటన ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో వైద్యశాస్త్రంలో మొదటగా నోబెల్ బహుమతిని ప్రకటించారు. అమెరికన్ శాస్త్రవేత్తలు హార్వే జే అల్టర్, మైఖెల్ హాటన్‌, బ్రిటీష్‌ శాస్త్రవేత్త ఛార్లెస్‌ ఎం. రైస్‌లు సంయుక్తంగా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. హెపటైటిస్ సీ వైరస్‌కి కనుగొన్నందుకు గానూ వారికి ఈ అత్యున్నత పురస్కారం లభించింది. వీరి పేర్లను స్టాక్‌హోమ్‌లో నోబుల్‌ కమిటీ థామస్ పెర్లమన్‌ ప్రకటించారు. కాగా హెపటైటిస్‌(కాలేయంలో మంట)  వలన ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 4లక్షల మంది చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. అలాగే ఇప్పటివరకు ఈ వైరస్ 70మిలియన్‌ మందికి సోకినట్లు వారు చెబుతున్నారు. దీని వలన చాలా మంది కాలేయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. కాగా హెపటైటిస్‌లో ఏ, బీ వైరస్ రకాలు ఉండగా.. వీరు హెపటైటిస్‌ సి ని గుర్తించారు. దీనివలన ఈ రోగానికి మందును కనుగొనేందుకు మరింత సులభతరం అవ్వనుంది.

Read More:

క్రేజీ న్యూస్‌.. విజయ్‌- అనుష్క కాంబోలో మూవీ..!

బిజినెస్‌మెన్‌ని పెళ్లాడబోతున్న కాజల్‌..!