‘కోవిడ్ పై ‘రియల్ స్కూల్’ కి వెళ్లి చాలా నేర్చుకున్నా’, ట్రంప్

కోవిడ్-19 గురించి 'రియల్ స్కూల్' (ఆసుపత్రి) కి వెళ్లి తాను చాలా నేర్చుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇది మామూలుగా పుస్తకాలు చదివి స్కూలుకు వెళ్లినట్టు కాదు అని పేర్కొన్నారు.

'కోవిడ్ పై 'రియల్ స్కూల్' కి వెళ్లి చాలా నేర్చుకున్నా', ట్రంప్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 05, 2020 | 1:51 PM

కోవిడ్-19 గురించి ‘రియల్ స్కూల్’ (ఆసుపత్రి) కి వెళ్లి తాను చాలా నేర్చుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇది మామూలుగా పుస్తకాలు చదివి స్కూలుకు వెళ్లినట్టు కాదు అని పేర్కొన్నారు.’ ఈ వైరస్ మీద వాస్తవ పాఠశాలకు వెళ్లి ఎంతో నేర్చుకున్నట్టు…. ‘ఈ ప్రయాణం కాస్త ఆసక్తికరంగా కూడా ఉందని’  వ్యాఖ్యానించారు.  వాల్టర్ రీడ్ మిలిటరీ హాస్పిటల్ నుంచి మంచి రిపోర్టులు అందుకున్నానని, డాక్టర్ల విధి నిర్వహణ అమేజింగ్ అని ట్రంప్ కితాబిచ్చారు. హాస్పటల్ బయట తనకోసం వేచి ఉన్న తన మద్దతుదారులు, తన అభిమానులను ఆయన దేశభక్తులుగా అభివర్ణించారు. వాళ్ళు మన దేశాన్ని పేమిస్తున్నారు, గతంలో కన్నా మనం ఇప్పుడు ఎంత గొప్పగా ఉన్నామో చూస్తున్నారు అని ఆయన చెప్పారు. కాగా-ట్రంప్ కు రెండు ‘ఎపిసోడ్ల బ్లడ్ ఆక్సిజన్ డ్రాప్స్’ ఇఛ్చినట్టు డాక్టర్లు తెలిపారు.

ఇంతకీ ట్రంప్ సారును ఆసుపత్రి డాక్టర్లు డిశ్చార్జి చేశారా లేక ఆయనే తనకు తాను స్వయంగా బయటకు వచ్ఛేశారా అన్న విషయం స్పష్టం కావడంలేదంటున్నారు. . ఆయన మరికొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండవలసి ఉంటుందని, రాబోయే రెండు రోజులూ ఆయనకు ‘గడ్డు రోజులేనని’  ఆసుపత్రి కి వెళ్లే ముందు ఆయన వైట్ హౌస్ లో ఆక్సిజన్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి.  వైట్ హౌస్ ప్రతినిధి మెడోస్ అయితే ట్రంప్ హెల్త్  చాలా విషమ స్థితిలో ఉన్నట్టు ప్రకటనలు చేశారు. మరి.. సార్ ఎప్పట్లాగే ఉత్సాహంగా, చిరునవ్వులు చిందిస్తూ బయటకు వచ్చారు.