కోవిడ్ అంటే భయపడకండి, నేను మాస్క్ తీసేశా, ట్రంప్
అమెరికన్లు కోవిడ్ అంటే భయపడాల్సిన అవసరం లేదని, తాను మాస్క్ తీసేశానని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. నాలుగు రోజులపాటు మిలిటరీ ఆసుపత్రిలో కోవిడ్ (?) కి చికిత్స పొంది సోమవారం బయటకి వఛ్చిన ఆయన..
అమెరికన్లు కోవిడ్ అంటే భయపడాల్సిన అవసరం లేదని, తాను మాస్క్ తీసేశానని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. నాలుగు రోజులపాటు మిలిటరీ ఆసుపత్రిలో కోవిడ్ (?) కి చికిత్స పొంది సోమవారం బయటకి వఛ్చిన ఆయన.. ఇక ఎప్పటిలాగే తను ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానన్నారు. మళ్ళీ వైట్ హౌస్ కు చేరుకున్న ట్రంప్ ఉత్సాహంగా కనిపించారు దేశంలో సుమారు 2 లక్షలకు పైగా ప్రజలు కొవిడ్ బారిన పడి మరణించారని, అయితే ఇక చాలావరకు ఈ మరణాలను నియంత్రించగలుగుతామని ఆయన చెప్పారు. కరోనా వైరస్ గురించి నేను ‘రియల్ స్కూల్’ (ఆసుపత్రికి) వెళ్లి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పిన ఆయన.. అనుభవజ్ఞులైన డాక్టర్ల వైద్యం నా ఆరోగ్యానికి ఎంతో తోడ్పడింది అని అన్నారు.. తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్.. ఇక ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు . నవంబరు 3 న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.’