గాలి ద్వారా కూడా కరోనా వ్యాపించవచ్చు ః సీడీసీ హెచ్చరిక

మూతికి మాస్క్‌లు పెట్టుకుని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుని, భౌతిక దూరం పాటిస్తూ, పరిసరాలను శానిటైజ్‌ చేసుకుంటూ కరోనా రాదని నిమ్మలంగా ఉంటుంటే.. కరోనా వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందనే వణుకుపుట్టించే వార్త చెప్పంది.

గాలి ద్వారా కూడా కరోనా వ్యాపించవచ్చు ః సీడీసీ హెచ్చరిక
Follow us
Balu

|

Updated on: Oct 06, 2020 | 12:03 PM

మూతికి మాస్క్‌లు పెట్టుకుని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుని, భౌతిక దూరం పాటిస్తూ, పరిసరాలను శానిటైజ్‌ చేసుకుంటూ కరోనా రాదని నిమ్మలంగా ఉంటుంటే.. కరోనా వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందనే వణుకుపుట్టించే వార్త చెప్పంది అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌.. కరోనా వైరస్‌ సోకినవారు తుమ్మితేనో, దగ్గితేనో తుంపర్లు వస్తాయి కదా.. ఆ తుంపర్లలోని వైరస్‌ గాలి ద్వారా అలా అలా ప్రయాణించి వేరొకిరికి సోకే అవకాశం ఉందని సీడీసీ తెలిపింది.. ఇక్కడ ఊరట కలిగించే విషయమేమింటే.. తుంపర్లు కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత పేలిపోయి వైరస్‌ నేలపై పడుతుందట.. అంటే ఆరు అడుగులకు మించి దూరంగా ఉన్నవారికి ఎలాంటి ప్రమాదమూ ఉండదు.. ఆరు అడుగుల లోపున్నవారే కాసింత జాగ్రత్తగా ఉండాలి.. గాలి, వెలుతురు సక్రమంగా లేని ప్రదేశాల్లో తుంపర్ల ద్వారా వైరస్‌ రెండు మీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుందని సీడీసీ చెబుతోంది. అయితే గాలిలో వైరస్‌ ఎంతసేపు జీవించి ఉంటుందన్నదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కొన్ని సెకన్లు ఉండొచ్చు.. లేదా కొన్ని గంటలూ ఉండొచ్చు అని చెబుతోంది.. గాలి, వెలుతురు ఎక్కువగా ఉన్న చోట తుంపర్లు తొందరగా పేలిపోవడమో, ఆవిరవ్వడమే జరుగుతుందని సీడీసీ వివరించింది. దీనివల్ల వైరస్‌ త్వరగా నిర్జీవంగా మారిపోయి, కరోనా తీవ్రత తగ్గుతుందని అంటోంది. అంచేత మనం ఉండే చోట గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచించింది. ఇది వరకటిలాగే మాస్కులు తప్పనిసరిగా ధరిస్తూ… శానిటైజర్లు వాడుతూ ఉండాలని సలహా ఇచ్చింది..