చాక్లెట్ చోరీ చేశాడని 13 ఏళ్ల బాలుని కొట్టి చంపిన షాపు ఓనర్!

మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. పసిపిల్లాడన్న కనికరంలేని దుర్మర్గులు చాక్లెట్ చోరీ చేశాడని చావగొట్టారు. ఈఘటన బీహార్‌లోని మధుబని జిల్లాలో ఒక చిన్నారిని చితకబాది హత్యచేసిన ఉదంతం అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చాక్లెట్ చోరీ చేశాడని 13 ఏళ్ల బాలుని కొట్టి చంపిన షాపు ఓనర్!
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 05, 2020 | 3:01 PM

మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. పసిపిల్లాడన్న కనికరంలేని దుర్మర్గులు చాక్లెట్ చోరీ చేశాడని చావగొట్టారు. ఈఘటన బీహార్‌లోని మధుబని జిల్లాలో ఒక చిన్నారిని చితకబాది హత్యచేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. హత్యచేసిన అనంతరం ఆ బాలుని మృతదేహాన్ని భూమిలో పాతిపెట్టారు.

చాక్లెట్ చోరీ చేసేడని ఓ దుకాణం యజమాని ఓ బాలుడిని స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు. బాలుని కుటుంబ సభ్యులను ఇంటిలో బంధించాడు. అతని దెబ్బలకు తాళలేక బాలుడు మరణించాడు. దీంతో అన్ని శ్మశానికి తీసుకెళ్లి పూడ్చి పెట్టాడు. మూడు రోజుల తరువాత ఈ ఉదంతం వెలుగు చూసింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధుబని పరిధిలోని హర్లాకీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోఠ్‌గావ్‌లో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అహ్మద్(13) తండ్రి సబ్బుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అహ్మద్ ఇంటి బయట ఆడుకుంటుండగా.. ఇంతలో అక్కడికి సమీపంలో దుకాణం నిర్వహిస్తున్న కాసిమ్ అక్కడికి వచ్చి, ఆ బాలుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చావబాదాడు. ఈ ఘటనలో అహ్మద్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడు చనిపోవడంతో కంగుతిన్న కాసిమ్ ఆ బాలుడి మృతదేహాన్ని అతని ఇంటివద్ద వదిలేసి పారిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడ్డారు. అయితే, ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది మత పెద్దలు బాలుని మృతదేహాన్ని రహస్యంగా భూమిలో పాతిపెట్టారు. తరువాత మృతుని కుటుంబ సభ్యులను ఇంటి నుంచి వెళ్లిపొమ్మని హెచ్చరించారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తరువాత మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఈ దారుణం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా నిర్వహించారు. పరారీలో ఉన్న నిందితుడు కాసిమ్ కోసం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు.