కష్ట కాలంలోనూ వసూళ్లే.. మీరిక మారరా?

తెలుగు మత్స్యకారుల నుంచి ఒక్కొక్కరి నుంచి 3 వేల రూపాయలు వసూలు చేసేలా.. డ్రై ఫ్రూట్స్ పాకెట్లతో బేరసారాలు మొదలుపెట్టారు. మూడువేల రూపాయలు ఇస్తే గాని డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ ఇవ్వలేమని దళారులు బేరం పెట్టారు.

కష్ట కాలంలోనూ వసూళ్లే.. మీరిక మారరా?
Follow us
Rajesh Sharma

|

Updated on: Apr 29, 2020 | 7:08 PM

కరోనా వైరస్ ప్రభావం ఒకవైపు.. లాక్ డౌన్ ఆంక్షలు మరొకవైపు వెరసి దేశవ్యాప్తంగా వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులు చెప్ప తరం కానివి. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు కూడా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయారు. ఈ రకంగా గుజరాత్ తీరంలో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను విడిపించేందుకు, తిరిగి వారిని ఆంధ్రప్రదేశ్‌కు రప్పించేందుకు జగన్ ప్రభుత్వం.. ఆటు గుజరాత్ ప్రభుత్వంతోను, ఇటు కేంద్ర హోంశాఖతోను సంప్రదింపులు జరిపి ప్రత్యేక వాహనాలలో వారిని తరలించేందుకు ప్రయత్నం చేసింది.

ఈ ప్రయత్నాలు సఫలమై వారు తమ స్వస్థలాలకు బయలుదేరుతున్న సందర్భంలో దళారులు ఎంటరయ్యారు. ప్రత్యేక వాహనాలలో తరలిస్తున్న వలస కార్మికుల కోసం ఒక్కొక్కరికి సుమారు మూడు వేల రూపాయల విలువ చేసే డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లను కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. అయితే దళారులు వీటిని మార్చేశారు. తెలుగు మత్స్యకారుల నుంచి ఒక్కొక్కరి నుంచి 3 వేల రూపాయలు వసూలు చేసేలా.. డ్రై ఫ్రూట్స్ పాకెట్లతో బేరసారాలు మొదలుపెట్టారు. మూడువేల రూపాయలు ఇస్తే గాని డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ ఇవ్వలేమని దళారులు బేరం పెట్టారు. దాదాపు రెండు, మూడు రోజుల ప్రయాణంలో మార్గమధ్యంలో తినేందుకు ఏమీ దొరకవని.. ఈ డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఏకైక దిక్కని తెలుగు జాలర్లకు వాటిని విక్రయించేందుకు ప్రయత్నం చేశారు.

డబ్బులున్న జాలర్లు వాటిని కొనుగోలు చేయగా మిగిలిన వారు ఏమి చేయలేక మిన్నకుండిపోయారు. అయితే కొందరు తెలుగు జాలర్లు చొరవ చూపి దళారుల దందాను గుజరాత్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. దాంతో రంగంలోకి దిగిన గుజరాత్ పోలీసులు దళారుల కింగ్ పిన్‌ని అదుపులోకి తీసుకున్నారు. జాలర్ల వద్ద డబ్బులు వసూలు వ్యక్తిని గుర్తించారు. అయితే అతను కూడా తెలుగువాడే అవడం షాక్‌కు గురి చేసే విషయం. 60 మంది వద్ద మనిషికి  3 వేల రూపాయలు వసూలు చేసిన నారాయణ రావు కూడా మత్స్యకారుల్లో ఒకడని గుర్తించారు. నారాయణ రావును అరెస్ట్ చేసి రాజ్‌కోట్ జైలుకు తరలించారు.

ఆ తర్వాత ప్రతి బస్సుతో ఒక ప్రత్యేక అధికారిని నియమించి, పంపించింది గుజరాత్ ప్రభుత్వం. ప్రతి వ్యక్తి 3 వేలు విలువ చేసే డ్రైఫ్రూట్స్ తో కూడిన ఫుడ్ కిట్ అందజేశారు. దారి మధ్యలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో మూడు బస్సుల్లో తెలుగు జాలర్లు రోడ్డు మార్గం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంగళవారం రాత్రి బయలుదేరారు.

Read this: అలా చేస్తేనే డ్యూటీకి రండి!.. ఉద్యోగులకు కేంద్రం షరతు

Read this:  రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగింపు 

Read this:  ఏపీలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపు

Read this:  కరోనా కేసుల సంఖ్యలో ఏదో మతలబు.. బండి డౌట్

Read this:  లాక్‌డౌన్ అలా కలిసొచ్చింది.. శరవేగంగా పనులు

Read this:  ఉద్యోగులపై కార్మికుల దాడి.. ఐఐటీలో టెన్షన్..టెన్షన్

Read this:  మే 3 తర్వాత లాక్‌డౌన్ కొనసాగింపు.. కిషన్‌రెడ్డి క్లారిటీ

Read this:  సర్కార్ చెప్పిన పంటల్ని వేయాలి.. రైతులకు కెసిఆర్ ఆదేశం

Read this:  కల్లు ప్రియులకు శుభవార్త.. ఏపీలో గ్రీన్ సిగ్నల్!

Read this:  గవర్నర్‌పై గుస్సా.. దీక్షకు దిగిన మంత్రి