AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమ‌ల కంటైన్మెంట్ జోన్ కాదు.. క‌్లారిటీ ఇచ్చిన క‌లెక్ట‌ర్‌..

తిరుప‌తిలోని ప‌లు వార్డుల‌తో పాటు తిరుమల‌ను కూడా కంటైన్మైంట్ జోన్‌గా ప్ర‌క‌టించ‌డంతో వివాదం రాజుకుంది. టీటీడీ నుంచి అభ్యంత‌రాలు రావ‌డంతో.. మ‌రోమారు దీనిపై స్ప‌ష్టత ఇచ్చారు చిత్తూరు జిల్లా కలెక్ట‌ర్. క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి స‌న్నిధి తిరుమ‌ల‌లో కూడా క‌రోనా కేసులు...

తిరుమ‌ల కంటైన్మెంట్ జోన్ కాదు.. క‌్లారిటీ ఇచ్చిన క‌లెక్ట‌ర్‌..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 09, 2020 | 5:00 PM

Share

తిరుప‌తిలోని ప‌లు వార్డుల‌తో పాటు తిరుమల‌ను కూడా కంటైన్మైంట్ జోన్‌గా ప్ర‌క‌టించ‌డంతో వివాదం రాజుకుంది. టీటీడీ నుంచి అభ్యంత‌రాలు రావ‌డంతో.. మ‌రోమారు దీనిపై స్ప‌ష్టత ఇచ్చారు చిత్తూరు జిల్లా కలెక్ట‌ర్. క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి స‌న్నిధి తిరుమ‌ల‌లో కూడా క‌రోనా కేసులు పెరుగుతూ ఉండ‌టం వ‌ల్ల జిల్లా ఉన్న‌తాధికారులు.. తిరుమ‌ల‌ను కూడా కంటైన్మైంట్ జోన్‌గా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ త‌రువాత కొద్ది సేప‌టికే తిరుమ‌ల‌ను పొర‌పాటున కంటైన్మైంట్ జోన్‌గా ప్ర‌క‌టించామ‌ని చెబుతూ జిల్లా అధికారులు మ‌రో లిస్టును విడుద‌ల చేశారు.

తిరుమలను కంటైన్మెంట్ జోన్ పరిధి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది చిత్తూరు కలెక్టర్ కార్యాలయం. తిరుమల పేరు లేకుండా మళ్లీ కొత్త కంటైన్మెంట్ జోన్ లిస్ట్‌ను విడుదల చేసింది టీటీడీ. దీంతో భ‌క్తుల ద‌ర్శ‌నాల‌కు ఆటంకం తొల‌గిపోయింది. ఇక అలాగే భ‌క్తులు ఎలాంటి ఆందోళ‌న లేకుండా స్వామి వారిని ద‌ర్శించుకోవాల‌ని టీటీడీ ప్ర‌క‌టించింది. తిరుమల కంటైన్మెంట్ జోన్ ప్రకటనపై మీడియాలో బ్రేకింగ్ రావడంతో చేసిన పొరబాటు గుర్తించిన‌ కలెక్టర్ కార్యాలయం.. వెంట‌నే ఆ లిస్టులో మార్పులు చేసి కొత్త లిస్టును రిలీజ్ చేసింది. కాగా క‌రోనా వ్యాప్తి కార‌ణంగా టీటీడీ ఇప్పుడు ప‌రిమిత సంఖ్య‌లో ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తులిస్తోంది. ప్ర‌స్తుతానికి రోజుకు పదివేల మందిని మాత్ర‌మే స్వామిని ద‌ర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తుంది.

Read More:

క‌రోనా వైర‌స్‌తో హీరో తండ్రి మృతి.. విషాదంలో కుటుంబం

క‌రోనాకు చెక్ పెట్టేందుకు త‌క్కువ ధ‌ర‌కే మ‌రో జ‌న‌రిక్ మెడిసిన్‌..

Follow Us
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!