రష్యాలో రికార్డుస్థాయి కరోనా కేసులు

రష్యాలో కరోనా వికృత రూపం దాల్చుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలో ఆ దేశవ్యాప్తంగా 6,509 మందికి కరోనా పాజిటివ్‌ గా వైద్యులు నిర్ధారించారు. ఇప్పటివరకు రష్యాలో 7,07,301 మంది కరోనా బారినపడ్డారు

రష్యాలో రికార్డుస్థాయి కరోనా కేసులు
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 09, 2020 | 5:41 PM

కరోనా కరాళనృత్యానికి ప్రపంచం విలవిలలాడుతోంది. ప్రతి రోజు కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. అటు రష్యాలో కరోనా వికృత రూపం దాల్చుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలో ఆ దేశవ్యాప్తంగా 6,509 మందికి కరోనా పాజిటివ్‌ గా వైద్యులు నిర్ధారించారు. ఇందులో 1,778 మందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆ దేశ అధికారులు వెల్లడించారు. మాస్కోలో అత్యధికంగా 568 కేసులు నమోదయ్యాయని, ఇది కేసుల పెరుగుదల శాతంలో మాత్రం ఆ నగరం చివరిస్థానంలో ఉందని అధికారులు పేర్కొన్నారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో 292 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రష్యాలో 7,07,301 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 4,81,316 మంది కరోనా చికిత్స అనంతరం కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరోవైపు ఇవాళ ఒక్కరోజులో 176 మంది కరోనాను జయించలేక మరణించారు. ఇక, ఇప్పటి వరకు కరోనా కాటుకు 10,843 మంది బలయ్యారని రష్యా అధికారులు వెల్లడించారు.