త్రో బ్యాక్ ఫోటో… డీప్ డిస్కషన్‌లో చిరు…మహేష్
టాలీవుడ్‌లో స్టార్ హీరోల మధ్య మంచి స్నేహపూరిత వాతావరణం ఉన్నప్పటికీ వారు నిత్యం కలుసుకోవడం చాలా అరుదు. ఏదో సినిమా ఫంక్షన్ సమయంలోనో.. ప్రముఖులకు...
Chiranjeevi and Mahesh Babu Throw Back Photo Viral : టాలీవుడ్‌లో స్టార్ హీరోల మధ్య మంచి స్నేహపూరిత వాతావరణం ఉన్నప్పటికీ వారు నిత్యం కలుసుకోవడం చాలా అరుదు. ఏదో సినిమా ఫంక్షన్ సమయంలోనో.. ప్రముఖులకు సంభందించిన వెడ్డింగ్ సమయంలోనో.. అయితేనే.. ఇండస్ట్రీ మొత్తం కలిసి చేసుకునే ఫంక్షన్ లోనే కలుస్తుంటారు.
ఇక సూపర్‌స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి కుటుంబాల మధ్య ఎప్పట్నుంచో మంచి అనుబంధం ఉంది. మహేష్ బాబు అటు చిరంజీవితోనూ ఇటు రామ్‌చరణ్‌తోనూ ఫ్రెండ్లీ గా ఉంటారు. మహేష్, చెర్రీ ఫ్యామిలీలు కలిసి విదేశీ యాత్రలకు కూడా వెళుతుంటాయి.
ఇటీవల మహేష్ “సరిలేరు నీకెవ్వరు” ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు నిలిచిపోవడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. అయితే తాజాగా ఆ ఇద్దరు తెలుగు స్టార్స్ కలిసి ఉన్న పాత ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఫొటోలో చిరంజీవి, మహేష్‌తోపాటు అల్లు అరవింద్, దర్శకుడు గుణశేఖర్ కూడా ఉన్నారు. `అర్జున్` సినిమా పైరసీ వివాద సమయంలో చిరంజీవిని మహేష్ కలిసిన సందర్భంగా తీసిన ఫొటో ఇది అని ప్రచారం జరుగుతోంది.