క‌రోనాకు చెక్ పెట్టేందుకు త‌క్కువ ధ‌ర‌కే మ‌రో జ‌న‌రిక్ మెడిసిన్‌..

ప్ర‌పంచ వ్యాప్తంగా విల‌య తాండ‌వం చేస్తోంది క‌రోనా మ‌హ‌మ్మారి. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌ముఖ ఫార్మా కంపెనీ సిప్లా కరోనా వైర‌స్ రోగుల కోసం జ‌న‌రిక్ రెమ్‌డెసివిర్ మెడిసిన్‌ని మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. అది కూడా త‌క్కువ ధ‌ర‌కే మార్కెట్లోకి తీసుకుని...

క‌రోనాకు చెక్ పెట్టేందుకు త‌క్కువ ధ‌ర‌కే మ‌రో జ‌న‌రిక్ మెడిసిన్‌..
Follow us

| Edited By:

Updated on: Jul 09, 2020 | 8:07 AM

ప్ర‌పంచ వ్యాప్తంగా విల‌య తాండ‌వం చేస్తోంది క‌రోనా మ‌హ‌మ్మారి. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌ముఖ ఫార్మా కంపెనీ సిప్లా కరోనా వైర‌స్ రోగుల కోసం జ‌న‌రిక్ రెమ్‌డెసివిర్ మెడిసిన్‌ని మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. అది కూడా త‌క్కువ ధ‌ర‌కే మార్కెట్లోకి తీసుకుని వ‌చ్చింది ఈ ఫార్మా కంపెనీ. కాగా ఈ జ‌న‌రిక్ మందును డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదించింది.

ఇ‌క సిప్రెమి పేరుతో విడుదల చేసిన ఈ జ‌న‌రిక్ మందు ధర‌ రూ.4 వేలు. తొలి నెల‌లోనే 80 వేల వ‌య‌ల్స్ స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు కంపెనీ పేర్కొంది. ఈ సంద‌ర్భంగా కంపెనీ సీఈవో నిఖిల్ చోప్రా మాట్లాడుతూ.. అందరికీ అందుబాటులో ఉండేలా త‌మ జ‌న‌రిక్ రెమ్‌డెసివిర్ 100 ఎంజీ వ‌య‌ల్ ధ‌ర రూ.4,000లుగా నిర్ణ‌యించిన‌ట్లు వెల్ల‌డించారు. అలాగే ప్ర‌పంచం మొత్తం మీద ఇదే అతి త‌క్కువ ధ‌ర అని ఆయ‌న తెలిపారు.

కాగా ప్ర‌స్తుతం జ‌న‌రిక్ వెర్ష‌న్ ఇదే ఔష‌దాన్ని హైద‌రాబాద్‌కు చెందిన హెటిరో రూ.5,400 చొప్పున‌, మైలాన్ కంపెనీ 4,800 చొప్పున అమ్ముతున్నాయి. అయితే ఈ మెడిసిన్ ప్ర‌స్తుతం కేవ‌లం ప్ర‌భుత్వ ఆసుప‌త్రి మార్గాల ద్వారా మాత్రమే ల‌భిస్తుంది.

Read More:

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా విల‌యం.. పెరుగుతోన్న మృతుల సంఖ్య‌…