భారీ భద్రత నడుమ.. సచివాలయం చేరుకున్న సీఎం జగన్

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల మహా ధర్నా 56వ రోజుకి చేరింది. ఈ ఆందోళనలో భాగంగా మందడంలో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. సీఎం జగన్ సచివాలయం వైపు వస్తోన్న నేపథ్యంలో, మందడంలో మహా ధర్నా చేస్తోన్న రైతులు రోడ్డుపైకి రాకుండా.. పోలీసులు శిబిరం ఎదుట ముళ్ల ఫెన్సింగ్, బారిగేడ్స్‌ను అడ్డుగా పెట్టారు. ధర్నాకి అనుమతి లేదని.. రైతులతో వాదనకు దిగారు. అయితే రైతులు మాత్రం ధర్నాను శాంతీయుతంగానే చేస్తున్నామన్నారు. రైతులు బయటకి కనపడకుండా దీక్షా శిబిరానికి […]

భారీ భద్రత నడుమ.. సచివాలయం చేరుకున్న సీఎం జగన్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 11, 2020 | 12:15 PM

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల మహా ధర్నా 56వ రోజుకి చేరింది. ఈ ఆందోళనలో భాగంగా మందడంలో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. సీఎం జగన్ సచివాలయం వైపు వస్తోన్న నేపథ్యంలో, మందడంలో మహా ధర్నా చేస్తోన్న రైతులు రోడ్డుపైకి రాకుండా.. పోలీసులు శిబిరం ఎదుట ముళ్ల ఫెన్సింగ్, బారిగేడ్స్‌ను అడ్డుగా పెట్టారు. ధర్నాకి అనుమతి లేదని.. రైతులతో వాదనకు దిగారు. అయితే రైతులు మాత్రం ధర్నాను శాంతీయుతంగానే చేస్తున్నామన్నారు.

రైతులు బయటకి కనపడకుండా దీక్షా శిబిరానికి అడ్డుగా తెరలు కట్టారు పోలీసులు. మందడం దీక్షాశిభిరంలో మహిళలు హానుమాన్ చాలీసా చదువుతున్నారు. అలాగే వెలగపూడిలో 56వ రిలే నిరాహారదీక్షలు మొదలయ్యాయి. మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్ళూరులో రైతులు 24 గంటలపాటు నిరాహారదీక్ష చేపట్టారు.