ఏపీలో సీబీఐ కోర్టు విడిపోయింది.. జ్యూరిస్డిక్షన్స్ ఇవే
ఏపీలో సీబీఐ కోర్టును విడదీస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం విజయవాడలో వున్న సీబీఐ కోర్టు ఇకపై విజయవాడతోపాటు విశాఖపట్నంలోను కొనసాగుతుంది. రెండు సీబీఐ కోర్టుల పరిధిలోకి వచ్చే జిల్లాలను సోమవారం నోటిఫై చేసింది ప్రభుత్వం. తాజా నోటిఫికేషన్ ప్రకారం విజయవాడ, విశాఖల్లోని సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానాలకు నాలుగేసి జిల్లాల చొప్పున పరిధిని కేటాయించారు. విశాఖపట్నంలో ఏర్పాటయ్యే సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం పరిధిని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల వరకు […]
ఏపీలో సీబీఐ కోర్టును విడదీస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం విజయవాడలో వున్న సీబీఐ కోర్టు ఇకపై విజయవాడతోపాటు విశాఖపట్నంలోను కొనసాగుతుంది. రెండు సీబీఐ కోర్టుల పరిధిలోకి వచ్చే జిల్లాలను సోమవారం నోటిఫై చేసింది ప్రభుత్వం. తాజా నోటిఫికేషన్ ప్రకారం విజయవాడ, విశాఖల్లోని సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానాలకు నాలుగేసి జిల్లాల చొప్పున పరిధిని కేటాయించారు.
విశాఖపట్నంలో ఏర్పాటయ్యే సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం పరిధిని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల వరకు ఉంటుందని నిర్ధారించారు. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన సీబీఐ కేసుల అదనపు న్యాయస్థానం పరిధి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వరకూ ఉంటుందని స్పష్టం చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసులను కాకుండా ఇతర కేసులను విజయవాడలోని ఐదవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు చేపడుతుందని న్యాయశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.