మహేశ్‌కేనా కర్నూలు సెంటిమెంట్.. నాక్కూడా అంటున్న జనసేనాని
సూపర్ స్టార్ మహేశ్‌బాబు తరహాలోనే తనకూ కొండారెడ్డి బురుజు సెంటిమెంట్ అనబోతున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. అయితే అది సినిమాల్లో కాదు.. రాజకీయాల్లో. గత పదిహేను రోజులుగా సినిమాలతో బిజీగా వున్న పవన్ కల్యాణ్.. ఫిబ్రవరి రెండోవారంలో రాజకీయాలపై దృష్టి సారించబోతున్నారు. అందులో కొండారెడ్డి బురుజు ఓ ప్రత్యేకత సంతరించుకోబోతోంది. అమితాబ్ నటించిన పింక్ తెలుగు రీమేక్‌లో బిగ్ బీ పోషించిన లాయర్ సాబ్ పాత్రని పవన్ కల్యాణ్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 20న ప్రారంభమైన […]
సూపర్ స్టార్ మహేశ్‌బాబు తరహాలోనే తనకూ కొండారెడ్డి బురుజు సెంటిమెంట్ అనబోతున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. అయితే అది సినిమాల్లో కాదు.. రాజకీయాల్లో. గత పదిహేను రోజులుగా సినిమాలతో బిజీగా వున్న పవన్ కల్యాణ్.. ఫిబ్రవరి రెండోవారంలో రాజకీయాలపై దృష్టి సారించబోతున్నారు. అందులో కొండారెడ్డి బురుజు ఓ ప్రత్యేకత సంతరించుకోబోతోంది.
అమితాబ్ నటించిన పింక్ తెలుగు రీమేక్‌లో బిగ్ బీ పోషించిన లాయర్ సాబ్ పాత్రని పవన్ కల్యాణ్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 20న ప్రారంభమైన సినిమా షూటింగ్‌లో కొన్ని రోజులు పాల్గొన్న పవన్ కల్యాణ్ ఫిబ్రవరి 12 నుంచి ఏపీలో పర్యటనలకు సిద్దమవుతున్నారు. అందులో భాగంగా తొలిరోజున పవన్ కల్యాణ్ కర్నూలులో పర్యటించబోతున్నారు. ఫిబ్రవరి 12,13 తేదీలలో పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటన కొనసాగుతుంది. 12న కర్నూలులో ర్యాలీ చేపట్టి, బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం 3 గం.కు రాజ్‌విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో జనసేన నాయకులూ, శ్రేణులు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొంటాయి.
అనంతరం కోట్ల కూడలిలో బహిరంగ సభ నిర్వహిస్తారు. 13వ తేదీన ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీని సందర్శిస్తారు. విద్యార్థిని సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య ఘటనను పవన్ కల్యాణ్ ప్రధానంగా ప్రస్తావించే అవకాశం వుందని చెబుతున్నారు. 13వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకూ కర్నూలు, ఎమ్మిగనూరులో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకొంటారు. అనంతరం కర్నూలులో ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న జోహరాపురం వంతెన సమస్యపై స్థానికులతో మాట్లాడతారని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి.
జి+2 గృహాలను నిర్మించిన ప్రాంతానికి పవన్ కల్యాణ్ వెళ్తారని, గృహాలు పొందిన లబ్ధిదారులతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం ఎమ్మిగనూరు వెళ్ళి..అక్కడ వీవర్స్ కాలనీని సందర్శిస్తారని, చేనేత కార్మికుల సమస్యల గురించి అడిగి తెలుసుకుంటారని తెలిపారు.