Breaking: గాంధీలో కరోనా ఎఫెక్ట్..వైద్యుని ఆత్మహత్యాయత్నం
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మంగళవారం హైడ్రామా చోటుచేసుకుంది. కరోనా పేరిట తనను బలిపశువుని చేస్తున్నారంటూ ఓ డాక్టర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. పెట్రోల్ బాటిల్‌తో ఆసుపత్రికి వచ్చిన డాక్టర్ వసంత్ స్యూసైడ్ చేసుకునేందుకు యత్నించడంతో ఆసుప్రతి వర్గాలు ఉలిక్కి పడ్డాయి. అసలేం జరుగుతుందో తెలియక రోగులు, వారి బంధువులు కంగారుకు గురయ్యారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులున్నాయంటూ తాను ప్రచారం చేశానని తనపై చర్య తీసుకున్నారని, అసలు తాను అలాంటి ప్రచారం […]
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మంగళవారం హైడ్రామా చోటుచేసుకుంది. కరోనా పేరిట తనను బలిపశువుని చేస్తున్నారంటూ ఓ డాక్టర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. పెట్రోల్ బాటిల్‌తో ఆసుపత్రికి వచ్చిన డాక్టర్ వసంత్ స్యూసైడ్ చేసుకునేందుకు యత్నించడంతో ఆసుప్రతి వర్గాలు ఉలిక్కి పడ్డాయి. అసలేం జరుగుతుందో తెలియక రోగులు, వారి బంధువులు కంగారుకు గురయ్యారు.
గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులున్నాయంటూ తాను ప్రచారం చేశానని తనపై చర్య తీసుకున్నారని, అసలు తాను అలాంటి ప్రచారం చేయలేదని అనవసరంగా తనను బలిపశువును చేశారని డాక్టర్ వసంత్ అంటున్నారు. తన వాదనను ఎవరు పట్టించుకోకపోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సదరు డాక్టర్ గాంధీ ఆసుపత్రి ఆవరణలో హల్‌చల్ చేశాడు. మామూలుగా విధులకు హాజరయ్యేందుకు వచ్చిన వసంత్.. షర్ట్‌లో పెట్రోలో బాటిల్ వెంట తెచ్చుకున్నాడు.
హల్‌చల్ చేస్తున్న డాక్టర్ వసంత్‌ని అక్కడే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునేందుకు యత్నించారు. అదే సమయంలో వచ్చిన పోలీసులు అతన్ని పట్టుకునేందుకు యత్నించగా.. ఆయన తప్పించుకుని పరుగెత్తాడు. ఎట్టకేలకు పోలీసుల అతన్ని అదుపులోకి తీసుకుని, పెట్రోల్ బాటిల్‌ని అతన్నుంచి లాక్కోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తనపై అనవసర ఆరోపణలు రావడంతోనే మనస్తాపంతో అత్మహత్య చేసుకుందామని అనుకున్నట్లు డాక్టర్ వసంత్ చెబుతున్నారు.