అర్థరాత్రి మందుబాబుల వీరంగం… మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్.. ఏఎస్సైకి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం

హైదరాబాద్‌లో అర్థరాత్రి ఓ విద్యార్థి మద్యం మత్తులో వీరంగం స‌ృష్టించాడు. తాగి వాహనం నడపడమేకాకుండా అడ్డుకున్న పోలీసులపైకే దూసుకెళ్లాడు.

అర్థరాత్రి మందుబాబుల వీరంగం... మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్.. ఏఎస్సైకి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
Hyderabad Rash Driving
Follow us

|

Updated on: Mar 28, 2021 | 6:41 AM

Hyderabad rash driving : హైదరాబాద్‌లో అర్థరాత్రి ఓ విద్యార్థి మద్యం మత్తులో వీరంగం స‌ృష్టించాడు. తాగి వాహనం నడపడమేకాకుండా అడ్డుకున్న పోలీసులపైకే దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఏఎస్సైతో సహా హోంగార్డుకు గాయాలయ్యాయి. ఈ ఘటన కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట్ రోడ్డులో సృజన్ అనే బీటెక్ స్టూడెంట్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. అదే ప్రాంతంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మందు బాబు సృజన్ ను పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేస్తే రీడింగ్ 170 క్రాస్ అయింది. దీంతో తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో వెనుకాల ఉన్న కారును ఢీకొట్టాడు. మళ్ళీ టర్న్ తీసుకొని ఏకంగా అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డు పైకి దూసుకెళ్లాడు.

సృజన్ రోడ్డు ప్రమాదం చేసిన విషయాన్ని కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు పోలీసులకు సమాచారం ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. సృజన్‌ను అదుపులోకి తీసుకునేందుకు కేపీహెచ్‌బీ ఏఎస్సై మహిపాల్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అదే టైంలో వేగంగా దూసుకొచ్చిన మరో క్యాబ్ ఏఎస్సైని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన మహిపాల్ రెడ్డిని వెంటనే హాస్పటల్‌కు తరలించారు. మహిపాల్ రెడ్డి తలకు తీవ్రగాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. మందుబాబు సృజన్ తోసహా క్యాబ్ డ్రైవర్ అస్లాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఇద్దరి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also…  Raod Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. టెంపో-లారీ ఢీ.. ఎనిమిది మంది దుర్మరణం..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?