బిగ్‌బాస్‌ 3: ఫైనల్లో ఉండేది వీరిద్దరేనా..?

బిగ్‌బాస్ హౌస్‌ ఇక్కడ ఏదైనా జరగవచ్చు. అప్పుడే తిట్టుకుంటారు.. అరుస్తారు.. కాసేపటికి.. ఫ్రెండ్స్‌లా మారిపోతారు. ఇప్పుడు సీజన్ 3 కంప్లీట్ అవడానికి నాలుగు వారాల టైం ఉంది. ఇందులో ఎప్పుడు ఎవరు వెళ్తారనేదానిపై చాలా ఆసక్తి నెలకొంది. వరుస నామినేషన్లు, టాస్క్‌లు, కంటెస్టెంట్ల మధ్య గొడవలతో.. హాట్‌హాట్‌గా నడుస్తోంది బిగ్‌బాస్ సీజన్ 3. అయితే.. బిగ్‌బాస్‌ విన్నర్‌గా గెలవాలంటే.. హౌస్‌లో ఎలా ఉంటున్నామో.. ఒక ఎత్తు అయితే.. సోషల్ మీడియాలో ప్రచారం.. మరో ఎత్తు. చివరివరకూ హౌస్‌లో […]

బిగ్‌బాస్‌ 3: ఫైనల్లో ఉండేది వీరిద్దరేనా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Oct 07, 2019 | 10:16 PM

బిగ్‌బాస్ హౌస్‌ ఇక్కడ ఏదైనా జరగవచ్చు. అప్పుడే తిట్టుకుంటారు.. అరుస్తారు.. కాసేపటికి.. ఫ్రెండ్స్‌లా మారిపోతారు. ఇప్పుడు సీజన్ 3 కంప్లీట్ అవడానికి నాలుగు వారాల టైం ఉంది. ఇందులో ఎప్పుడు ఎవరు వెళ్తారనేదానిపై చాలా ఆసక్తి నెలకొంది. వరుస నామినేషన్లు, టాస్క్‌లు, కంటెస్టెంట్ల మధ్య గొడవలతో.. హాట్‌హాట్‌గా నడుస్తోంది బిగ్‌బాస్ సీజన్ 3. అయితే.. బిగ్‌బాస్‌ విన్నర్‌గా గెలవాలంటే.. హౌస్‌లో ఎలా ఉంటున్నామో.. ఒక ఎత్తు అయితే.. సోషల్ మీడియాలో ప్రచారం.. మరో ఎత్తు. చివరివరకూ హౌస్‌లో ఉండాలంటే.. ఓట్లు ఎక్కువగా రావాలి. అంటే.. ప్రజల సపోర్టు కూడా.. అంతే కావాలి.

బిగ్‌బాస్ సీజన్ 1లో శివబాలజీకి.. పీకే ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేశారనే వార్తలు వినిపిస్తాయి. అలాగే.. బిగ్‌బాస్ 2 విన్నర్ కౌశల్‌కి అయితే.. ఏకంగా సోషల్‌ మీడియాల్లో ఆర్మీలే తయారయ్యాయి. ఇప్పుడు అలానే.. బిగ్‌బాస్ సీజన్ 3లోని శ్రీముఖి, వరుణ్‌ల పేరిట ఆర్మీలు తయారయ్యాయి. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లకముందు నుంచే శ్రీముఖీ పేరిట ఆర్మీలంటూ.. సోషల్ మీడియాలో కొన్నిపేజీలు కనిపించాయి. అలాగే.. షో స్టార్‌ అయ్యే ముందులో కూడా కౌశల్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

కాగా.. ఫస్ట్‌ నుంచీ శ్రీముఖీ బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్ అని ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు. సాధారణంగానే ఆమెకు ఫ్యాన్స్ ఎక్కువ. ఇప్పుడు హౌస్‌లో ఆమె ఆటతీరు, ప్రవర్తన.. అంతా ఓకే. అందులోనూ అభిమానులు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక హీరో వరుణ్ సందేశ్ కూడా గేమ్ బాగా ఆడుతున్నాడు. ఏ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి.. ఎలా ఉండాలి.. ఎలా ప్రవర్తించాలి..? అనే విషయాల్లో.. వరుణ్‌కి ఫుల్‌గా మార్కులు పడుతున్నాయి. అలాగే.. ఇప్పటికే ఆయనకి కూడా బయట సోషల్ మీడియా నుంచి ఫుల్‌గా రెస్పాన్స్ ఉంటోంది. అలాగే.. గతవారం ఎలిమినేషన్‌ నుంచి కూడా సేవ్ అయ్యాడు. కాగా.. వీళ్లద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా టైటిల్‌ను పట్టికెళ్తారనే వార్తలు ప్రస్తుతం జోరుగా షికారు చేస్తున్నాయి. మరి విన్నర్‌ ఎవరో తెలుసుకోవాలంటే.. మరో రెండు వారాలు ఎదురు చూడక తప్పదు.

Varun and Vithuka