సోలో బ్రతుకే సో బెటర్ అంటోన్న సాయిధరమ్ తేజ్

సోలో బ్రతుకే సో బెటర్ హీరో సాయిధరమ్ తేజ్ అంటున్నాడు. సాయిధరమ్ ఏ సినిమా చేసినా.. మంచి క్యారెక్టర్స్‌ని ఎంచుకుంటూంటాడు. కాగా.. తాజాగా.. ‘చిత్రలహరి’ సినిమాతో హిట్‌ కొట్టిన సాయి.. ప్రస్తుతం ‘ప్రతీరోజూ పండగే’ సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. కాగా.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు సాయి. అదే.. `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` చిత్రం. సాయితేజ్‌, న‌భా న‌టేశ్ జంట‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` […]

సోలో బ్రతుకే సో బెటర్ అంటోన్న సాయిధరమ్ తేజ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 07, 2019 | 1:33 PM

సోలో బ్రతుకే సో బెటర్ హీరో సాయిధరమ్ తేజ్ అంటున్నాడు. సాయిధరమ్ ఏ సినిమా చేసినా.. మంచి క్యారెక్టర్స్‌ని ఎంచుకుంటూంటాడు. కాగా.. తాజాగా.. ‘చిత్రలహరి’ సినిమాతో హిట్‌ కొట్టిన సాయి.. ప్రస్తుతం ‘ప్రతీరోజూ పండగే’ సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. కాగా.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు సాయి. అదే.. `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` చిత్రం.

సాయితేజ్‌, న‌భా న‌టేశ్ జంట‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా సోమవారం ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్‌లో జ‌రిగాయి. టైటిల్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. నవంబ‌ర్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2020 వేస‌విలో విడుద‌ల చేసేలా ప్లాన్ చేశారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెంక‌ట్ సి.దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.