మద్యం కిక్‌కు తెలంగాణ సర్కార్ బ్రేక్..!!

మద్యం షాపు యజమానులకు తెలంగాణ సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం, మంగళవారం దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో వైన్‌ షాపు ఓనర్లకు.. కేసీఆర్ పలు సూచనలు జారీ చేశారు. పండగ కదా అని అధిక రేట్లు వసూల చేసే ప్రయత్నం చేస్తే.. తాట తీయడానికి సిద్ధమని తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. ఇదీ.. వైన్‌ షాపులకు సర్కార్ చేసిన హెచ్చరిక. తెలంగాణలో.. దసరా, బతుకమ్మ అతి పెద్ద పండుగలు. ఆధ్యాత్మికత.. ఆనందం కలిసిన ఈ పండుగలో […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:08 am, Mon, 7 October 19
మద్యం కిక్‌కు తెలంగాణ సర్కార్ బ్రేక్..!!

మద్యం షాపు యజమానులకు తెలంగాణ సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం, మంగళవారం దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో వైన్‌ షాపు ఓనర్లకు.. కేసీఆర్ పలు సూచనలు జారీ చేశారు. పండగ కదా అని అధిక రేట్లు వసూల చేసే ప్రయత్నం చేస్తే.. తాట తీయడానికి సిద్ధమని తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. ఇదీ.. వైన్‌ షాపులకు సర్కార్ చేసిన హెచ్చరిక. తెలంగాణలో.. దసరా, బతుకమ్మ అతి పెద్ద పండుగలు. ఆధ్యాత్మికత.. ఆనందం కలిసిన ఈ పండుగలో మాంసంతో పాటు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయి. దీంతో.. డిమాండ్ బాగా పెరుగుతుంది.

ఈ క్రమంలో.. మద్యంపై రేటు పెంచేసి దండుకుందామని చూస్తే.. దాడులు తప్పవని హెచ్చరించింది తెలంగాణ సర్కార్. లిక్కర్ ఏదైనా ఎమ్మార్పీ రేటుకే అమ్మాలని.. అలా కాదని ఎక్కువ రేట్లకు అమ్మితే.. రెండు లక్షల రూపాయల ఫైన్‌తో పాటు.. కనీసం వారం రోజుల పాటు షాపును క్లోజ్ చేయాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గత వారంలో శుక్ర, శనివారాల్లో హైదరాబాద్, నల్గొండ, వనపర్తి, నిజామాబాద్ జిల్లాల్లో.. 8 వైన్ షాపులు ఎమ్మార్పీని క్రాస్ చేసినట్లు గుర్తించారు టాస్క్‌ఫోర్స్ అధికారులు. దసరా రద్దీని క్యాష్ చేసుకోవాలని ఏ యజమాని అయినా చూసినా.. భారీగా మూల్యం తప్పదని పలు సూచనలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే మద్యం షాపులపై టాస్క్‌ఫోర్స్ అధికారులు నిఘా ఉంచారు.