AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం ప్రియులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్

కరోనా లాక్ డౌన్ కాలం నుంచి అల్లాడిపోతున్న ఏపీ లిక్కర్ ప్రియులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై తాజా నిర్ణయం విశేషంగా ప్రభావం చూపడంతోపాటు.. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాకుండా వుంటుందని భావిస్తున్నారు.

మద్యం ప్రియులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్
Rajesh Sharma
|

Updated on: Oct 29, 2020 | 7:00 PM

Share

AP government good-news to liquor lovers:  ఏపీలో మద్యం ధరలు అడ్డగోలుగా వున్నాయంటూ గగ్గోలు పెడుతున్న మందు ప్రియులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రంలో మద్యం ధరలను గణనీయంగా తగ్గిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా, ప్రీమియం కేటగిరీ మద్యం ధరలను ఏకంగా 25 శాతం తగ్గించింది సర్కార్. తగ్గిన ధరలు రేపట్నించి అంటే అక్టోబర్ 30వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కరోనా వైరస్ ప్రభావం కారణంగా విధించిన లాక్ డౌన్‌ ఎత్తివేత మొదలైన జూన్ నెలలో ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను అనూహ్యంగా పెంచింది. మద్యం వినియోగం తగ్గాలనే ఉద్దేశంతోనే సర్కార్ ఆ నిర్ణయం తీసుకుందని అప్పట్లో ప్రభుత్వాధినేతలు, అధికార పార్టీనే నాయకులు చెప్పారు. అదే సమయంలో రాష్ట్రంలో వైన్సులను, బార్ల సంఖ్యను బాగా తగ్గించింది ప్రభుత్వం. అయితే.. మద్యం ధరలు భారీ స్థాయిలో వుండడం, రెగ్యులర్‌గా తమకు అలవాటైన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో పొరుగునే వున్న తెలంగాణ నుంచి మద్యాన్ని అక్రమంగా తరలించే వారి సంఖ్య పెరిగిపోయింది.

ఈ అక్రమ మద్యం తెలంగాణ సరిహద్దులో వున్న జిల్లాల నుంచి ఏకంగా తెలంగాణకు దూరంగా వున్న కడప, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాల్లోను భారీ ఎత్తున లభ్యమవుతున్న పరిస్థితి. తాజాగా గత రెండు, మూడు రోజులుగా చిత్తూరు, కడప జిల్లాల్లో తెలంగాణ నుంచి అక్రమంగా తరలించిన మద్యం పట్టుబడింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం 250 నుంచి 300 రూపాయల మధ్యన అమ్ముడయ్యే మద్యం ధరల్లో 50 రూపాయలు తగ్గుదల కనిపిస్తుంది.

భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం, విదేశీ మద్యం మద్య, ఉన్నత శ్రేణి బ్రాండ్లకు సంబంధించిన ధరల తగ్గించారు. 50 రుపాయల నుంచి 1350 రూపాయల వరకూ వివిధ కేటగిరీల్లో మద్యం ధరల తగ్గిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు అక్టోబరు 30 తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొన్నారు. బీర్లు, రెడీ టూ డ్రింక్ మద్యం ధరల్లో ఎలాంటి మార్పూ లేదని పేర్కొన్నారు. అదే విధంగా 200 రూపాయలులోపు క్వార్టర్ బాటిల్ ధరలపై మార్పు లేదని తెలిపారు.

ఎస్‌ఈబీ నివేదిక ఆధారంగా మద్యం ధరల తగ్గింపు

చీప్ లిక్కర్‌తో పాటు ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని తెలంగాణా నుంచి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ అవుతుండటంతో మద్యం ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు అబ్కారీ శాఖ తెలిపింది. సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15 మద్య కాలంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాకు సంబంధించి 1211 కేసులు నమోదు అయినట్టు వెల్లడించారు. తెలంగాణా నుంచి 630, కర్ణాటక నుంచి 546, ఒడిశా నుంచి 24, తమిళనాడు నుంచి 11 కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. తెలంగాణా, కర్ణాటకల్లో మద్యం ఎమ్మార్పీ ధరలు ఏపీ కంటే రెండింతలు తక్కువ కావటంతోనే స్మగ్లింగ్ జరుగుతున్నట్టు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఎస్ఈబీ. పొరుగు రాష్ట్రాల సరిహద్దులు పంచుకుంటున్న ఏపీ మండలాల్లో పెద్ద మొత్తంలో మద్యం అక్రమ రవాణా అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

Also read: 9 రోజుల్లో కోటికి పైగా కరోనా పరీక్షలు

Also read:  ధరణీ పోర్టల్ సీక్రెట్ వెల్లడించిన కేసీఆర్

Also read:  చెరుకు రైతులకు మోదీ కేబినెట్ శుభవార్త

Also read: నవంబర్ 2 నుంచి ఏపీ స్కూళ్ళు రీఓపెన్… కండీషన్స్ ఇవే

Also read: ఏపీ సీఎంకు ఉండవల్లి ఉచిత సలహా

Also read: అతి చేయొద్దు సూర్యా.. రవిశాస్త్రి వార్నింగ్

Follow Us