తమిళ ‘బిగ్‌బాస్’లో కమల్ నోట శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’.. పతితులారా అంటూ అదరగొట్టిన లోకనాయకుడు
Kamal Haasan Telugu: నటనలో లోకనాయకుడు, ఉలగనాయగన్ కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఆయన కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. పాత్ర ఏదైనా సరే ఒదిగిపోతారు. పాత్ర డిమాండ్ చేస్తే వయస్సును లెక్కచేయకుండా.. అందు కోసం ఎంతైనా కష్టపడతారు. ఇక తన నటనతో ఇటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించిన కమల్.. ఇప్పుడు మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు. తమిళ బిగ్‌బాస్ 4కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న కమల్ హాసన్.. […]
Kamal Haasan Telugu: నటనలో లోకనాయకుడు, ఉలగనాయగన్ కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఆయన కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. పాత్ర ఏదైనా సరే ఒదిగిపోతారు. పాత్ర డిమాండ్ చేస్తే వయస్సును లెక్కచేయకుండా.. అందు కోసం ఎంతైనా కష్టపడతారు. ఇక తన నటనతో ఇటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించిన కమల్.. ఇప్పుడు మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు.
తమిళ బిగ్‌బాస్ 4కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న కమల్ హాసన్.. వారాంతం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్‌లతో మాట్లాడుతూ తెలుగు మహాకవి శ్రీశ్రీ(శ్రీరంగం శ్రీనివాసరావు) ని స్మరించుకున్నారు. ఆయన రాసిన మహాప్రస్థానంలో జగన్నాథుని రథచక్రాలులోని.. పతితులారా , భ్రష్టులారా, బాధాసర్పద్రష్టులారా అన్న కవితను చెప్పి.. దాని తాత్పర్యాన్ని తమిళ్‌లోనూ వివరించారు. ఇక ఈ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా.. ఈ మహానటుడికి తెలుగు వారందరూ థ్యాంక్స్ చెప్పండి అని కామెంట్ పెట్టారు. కాగా ఆకలి రాజ్యం సినిమాలో కమల్ తన నోటితో ఈ కవితను వినిపించిన విషయం తెలిసిందే.
ఈ మహానటుడికి తెలుగువారందరూ థ్యాంక్స్ చెప్పండి .. pic.twitter.com/3MmWPpxLxo
— Saimadhav Burra (@saimadhav_burra) November 16, 2020