AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: నాగ్‌ లేకుండా వారాంతం షో.. ‘ప్రేమ మొదలైంది’ మూవీ అదిరిపోయింది

బిగ్‌బాస్‌లో మొదటిసారి వ్యాఖ్యత లేకుండా వారాంతం షో మొదలైంది. సినిమా షూటింగ్‌లో భాగంగా నాగార్జున హిమాలయాలకు వెళ్లడంతో

Bigg Boss 4: నాగ్‌ లేకుండా వారాంతం షో.. 'ప్రేమ మొదలైంది' మూవీ అదిరిపోయింది
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 25, 2020 | 8:15 AM

Share

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్‌ తెలుగు చరిత్రలో మొదటిసారి వ్యాఖ్యత లేకుండా వారాంతం షో మొదలైంది. సినిమా షూటింగ్‌లో భాగంగా నాగార్జున హిమాలయాలకు వెళ్లడంతో.. శనివారం నాటి షోకు ఆయన రాలేదు. దీంతో శుక్రవారం నాడు బిగ్‌బాస్‌ 4 కుటుంబ సభ్యులు చేసిన ప్రేమ మొదలైంది మూవీ ప్రీమియర్‌ని చూపించారు బిగ్‌బాస్‌. ఈ వేడకకు లాస్య, సొహైల్‌లు యాంకర్లుగా వ్యవహరించారు.

ఇక ప్రేమ మొదలైంది మూవీలో అఖిల్‌గా అఖిల్, స్రవంతిగా మోనాల్, సుబ్బలక్ష్మిగా అరియానా, ఏడుకొండలుగా అవినాష్, మెహబూబ్‌గా మెహబూబ్ కనిపించారు. కథలోకి వెళ్తే.. అఖిల్, స్రవంతి, సుబ్బలక్ష్మి బిగ్ బాస్ కాలేజీలో చదువుతుంటారు. ఈ క్రమంలో స్రవంతి, సుబ్బలక్ష్మి ఇద్దరూ అఖిల్‌ని ఇష్టపడతారు. కానీ, అఖిల్‌కి మాత్రం స్రవంతి అంటే ఇష్టం. మరోవైపు ఏడుకొండలకు తన మరదలు సుబ్బలక్ష్మి అంటే ప్రాణం. కానీ చదువురాని, అందంగా లేని బావ అంటే సుబ్బలక్ష్మికి అస్సలు నచ్చదు. తన మరదలు కోసం కాలేజీకి వచ్చిన ఏడుకొండలుని సుబ్బలక్ష్మి దారుణంగా అవమానిస్తుంది.

మరోవైపు తనను ప్రేమించమని సుబ్బలక్ష్మిని మెహబూబ్ అనే పోకిరి వేధిస్తూ ఉంటాడు. వాలంటైన్స్ డే రోజు తనే స్వయంగా వచ్చి ఐ లవ్ యు చెప్పాలని మెహబూబ్‌, సుబ్బలక్ష్మిని బెదిరిస్తాడు. సుబ్బలక్ష్మి చెప్పను అంటే ఆమెపై కటువుగా ప్రవర్తిస్తాడు. సుబ్బలక్ష్మిని మెహబూబ్ ఏడిపిస్తుండటం చూసి ఏడుకొండలు అడ్డుకుంటాడు. దీంతో మెహబూబ్‌ ఏడుకొండలను ఇష్టమొచ్చినట్టు కొడతాడు. అది చూసిన స్రవంతి, అఖిల్‌కి చెప్పి, పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఏడుకొండలుపై దాడి చేస్తున్న మెహబూబ్‌ను అఖిల్ అడ్డుకొని, అతడిని పోలీసులకు అప్పగిస్తాడు.

ఈ క్రమంలో తన కోసం చావడానికి కూడా సిద్ధపడిన బావ ఏడుకొండలును సుబ్బలక్ష్మి ప్రేమిస్తుంది. ఆ తరువాత జైలు నుంచి బయటికి వచ్చిన మెహబూబ్.. ఈసారి స్రవంతిపై పడతాడు. ఆమెను చంపేస్తానని బెదిరిస్తాడు. వెంటనే అఖిల్, ఏడుకొండలు కలిసి మెహబూబ్‌ని అంతమొందించి స్రవంతిని కాపాడుతారు. ఆ తరవాత అఖిల్-స్రవంతి, ఏడుకొండలు-సుబ్బలక్ష్మి ఒక్కటవుతారు. మధ్యలో వచ్చే ‘కెవ్వు కేక’ పాటకు హారిక, సొహైల్‌ ఇరగదీశారు. అయితే ఐటమ్‌ గర్ల్‌గా తనను చూసుకున్న తరువాత హారిక కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. కాగా ఈ సినిమాలో అందరూ తమ తమ పాత్రల్లో జీవించిపోయారు. అభి దర్శకత్వం అదిరిపోయింది.

Read More:

విజయదశమివేళ మంత్రిఫ్యామిలీ అమ్మవారి తొలిదర్శనం

IPL 2020 KXIP vs SRH: ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌పై పంజాబ్‌ విజయం