Bigg Boss 4: మోనాల్ సేఫ్.. దివిని హౌస్ నుంచి పంపించేశారు..!
బుల్లితెర పాపులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 4 ఏడో వారం చివరికి వచ్చింది. ఈ వారం నాగార్జున స్థానంలో హీరోయిన్ సమంతా హోస్టుగా సందడి చేయనుంది.
Bigg Boss 4: బుల్లితెర పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 4 ఏడో వారం చివరికి వచ్చింది. ఈ వారం నాగార్జున స్థానంలో హీరోయిన్ సమంతా హోస్టుగా సందడి చేయనుంది. ఇక ఏడో వారం ఎలిమినేషన్స్‌లో భాగంగా దివిని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడైంది. అంతేకాదు దివి అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. నిజానికి ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న హౌస్‌మేట్స్‌లో దివి, మోనాల్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక అందరి కంటే తక్కువ ఓట్లు దివికి వచ్చాయని వినికిడి.
కాగా, గతంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్లయిన యాంకర్ దేవి నాగవల్లి, కుమార్ సాయి ఎలిమినేషన్స్ జరిగినప్పుడు బిగ్ బాస్ ఓటింగ్ సిస్టంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే. జెన్యూన్‌గా, ప్రతీ టాస్క్‌లోనూ 100 శాతం ఎఫర్ట్స్ పెడుతున్నవారిని కావాలనే ఎలిమినేట్ చేస్తున్నారని నెటిజన్లు అంటున్నారు. ఇక మోనాల్, మెహబూబ్‌ను బిగ్ బాస్ నిర్వాహకులే కాపాడుతున్నారని ప్రేక్షకులు అనుకుంటున్నారు.