Bigg Boss 4: దివి ఔట్‌.. స్టేజ్‌పైనే సినిమా ఛాన్స్‌ ఇప్పించిన సమంత

బిగ్‌బాస్‌ 4లో మరో ఎలిమినేషన్ జరిగింది. షూటింగ్‌లో ఉండటంతో ఈ ఎపిసోడ్‌కి నాగార్జున గైర్హాజరు అవ్వగా.. ఆయన స్థానంలో కోడలు సమంత హోస్ట్‌గా వ్యవహరించారు

Bigg Boss 4: దివి ఔట్‌.. స్టేజ్‌పైనే సినిమా ఛాన్స్‌ ఇప్పించిన సమంత
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 26, 2020 | 7:21 AM

Bigg Boss 4 Divi elimination: బిగ్‌బాస్‌ 4లో మరో ఎలిమినేషన్ జరిగింది. షూటింగ్‌లో ఉండటంతో ఈ ఎపిసోడ్‌కి నాగార్జున గైర్హాజరు అవ్వగా.. ఆయన స్థానంలో కోడలు సమంత హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక ఆదివారం పండుగ కావడం, నాగ్‌ కూడా లేకపోవడంతో నామినేషన్‌ ఉండదని అందరూ భావించారు. కానీ ఎలిమినేషన్ మొదలు కాగా.. మొదటగా అరియానా సేవ్ అయ్యింది. ఆ తరువాత మోనాల్‌, నోయల్‌, అభిజిత్‌లు వరుసగా సేవ్‌ అయ్యారు. చివరగా అవినాష్‌, దివిలు మాత్రమే మిగిలారు. ఈ ఇద్దరిలో దివి ఎలిమినేట్ అయినట్టు సమంత వెల్లడించారు.

అయితే ఈ ఎలిమినేషన్‌ని పాజిటివ్‌గా తీసుకున్న దివి.. పండుగ రోజు వెళ్తున్నా ఏం బాధలేదు. బయట ఎవరు ఏం అనుకున్నా నాకు రాజశేఖర్ మాస్టర్‌ అమ్మాలాంటి వారు. నా ప్రవర్తన వలన ఎవరైనా బాధపడి ఉంటే సారీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన బిగ్‌బాస్‌కి థాంక్స్. ఇక్కడ నుంచి నా కెరీర్‌ స్టార్ట్ అవుతుంది అని మాట్లాడింది. కాగా దివి ఎలిమినేట్‌ సందర్భంగా అమ్మ రాజశేఖర్ చాలా ఏడ్చారు.

ఇక స్టేజ్‌ మీదికి వచ్చిన తరువాత పాజిటివ్‌ రియాక్ట్ రాగా.. బిగ్‌బాంబ్‌ని లాస్యపై విసిరింది. దాని ప్రకారం వారం రోజుల పాటు లాస్య మాత్రమే వంట చేయాలి. ఆమెకు ఒక అసిస్టెంట్ మాత్రమే ఉంటుంది. మరోవైపు స్టేజ్ మీదికి హీరో కార్తికేయ కూడా రాగా.. అతడి సినిమాలో దివికి ఛాన్స్ ఇవ్వాలని సమంత కోరింది. తప్పకుండా ఇస్తానని కార్తికేయ అభయం ఇచ్చాడు.

Read More:

ఇవాళ్టి నుంచి శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు

రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో బంగారు సీజ్