Bigg Boss 4: ప్రేమ మొదలైందన్న అఖిల్‌.. అలాంటిదేమీ లేదన్న మోనాల్‌

తనలోనూ ప్రేమ మొదలైందని అఖిల్‌ తెలిపారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ప్రేమ మొదలైంది ప్రీమియర్‌కి ముందు అందరినీ అరియానా కాంట్రవర్షియల్‌ ప్రశ్నలు వేశారు.

Bigg Boss 4: ప్రేమ మొదలైందన్న అఖిల్‌.. అలాంటిదేమీ లేదన్న మోనాల్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 25, 2020 | 8:40 AM

Bigg Boss 4 Akhil: తనలోనూ ప్రేమ మొదలైందని అఖిల్‌ తెలిపారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ప్రేమ మొదలైంది ప్రీమియర్‌కి ముందు అందరినీ అరియానా కాంట్రవర్షియల్‌ ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా అఖిల్‌ని ప్రేమ మొదలైంది అని టైటిల్ పెట్టారు.. మరి మీకు బీబీ హౌజ్‌లో ప్రేమ మొదలైందా? అలాంటివి ఏమైనా చిగురిస్తున్నాయా?’’ అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు అఖిల్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు.

‘‘అవును కచ్చితంగా బీబీ హౌజ్‌లో ప్రేమ మొదలైంది. ఆ ప్రేమ అందరిలో ఉంది. ఇక్కడ నాలో మొదలైంది. బయట ప్రేక్షకుల్లో కూడా నాపై ప్రేమ మొదలైంది. బంధాలు, అనుబంధాలు ఉండాలి కాబట్టి చిన్న చిన్న ప్రేమలు మనకు చాలా ముఖ్యం. ఆ ప్రేమల వలనే బయట ఉన్న ప్రేక్షకులు నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. కాబట్టి, ప్రేమ మొదలైందనే చెప్తా’’ అని అఖిల్ వెల్లడించారు.

ఇక మోనాల్‌కి కూడా అరియానా ఈ ప్రశ్న వేయగా.. ”లేదు. నిజంగా లేదు. చాలా మంది లైన్‌లో ఉన్నారు. నేను ఇప్పుడు చెప్తే బ్యాడ్‌గా ఫీలవుతారు” అని మోనాల్‌ అన్నారు.

Read More:

Bigg Boss 4: అరియానా కాంట్రవర్షియల్ ప్రశ్నలు.. అందరినీ ఆడుకుందిగా

Bigg Boss 4: బీబీ స్టార్ అవార్డ్స్‌.. ఎవరెవరికి ఏ అవార్డు వచ్చిందంటే