Bigg Boss 4: అరియానా కాంట్రవర్షియల్ ప్రశ్నలు.. అందరినీ ఆడుకుందిగా

బిగ్‌బాస్‌ 4లో వారాంతం ఎపిసోడ్‌కి హోస్ట్ లేకపోవడంతో ఆ ముందు రోజు ఇంటి సభ్యులు తెరకెక్కించిన 'ప్రేమ మొదలైంది' ప్రీమియర్, అవార్డ్స్‌ ప్రోగ్రామ్ నడిచింది.

Bigg Boss 4: అరియానా కాంట్రవర్షియల్ ప్రశ్నలు.. అందరినీ ఆడుకుందిగా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 25, 2020 | 8:14 AM

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్‌ 4లో వారాంతం ఎపిసోడ్‌కి హోస్ట్ లేకపోవడంతో ఆ ముందు రోజు ఇంటి సభ్యులు తెరకెక్కించిన ‘ప్రేమ మొదలైంది’ ప్రీమియర్, అవార్డ్స్‌ ప్రోగ్రామ్ నడిచింది. కాగా ఎపిసోడ్‌లో మూవీ ప్రీమియర్ మొదలు అవ్వకముందు ఒక్కొక్కరిని అరియానా ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ జస్ట్ టైమ్ పాస్ కోసం పెట్టినట్టుగా ఉన్న.. యాంకర్‌గా అరియానా బాగానే చేసింది. కాంట్రవర్షియల్ క్వశ్చన్స్‌ అడుగుతూ అందరినీ ఇబ్బంది పెట్టేందుకు బాగా ట్రై చేసింది. లాస్యని పప్పు గురించి అడిగింది. సొహైల్‌ని మీకు కోపంలో నరాలెందుకు వస్తున్నాయని అడిగింది. అందుకు సొహైల్‌ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. నాగ్ రక్షకుడు మూవీ చూసి వస్తున్నాయని.. ఆ తరువాత నాగ్ ఇచ్చిన వార్నింగ్‌తో పోయాయని సొహైల్ చెప్పాడు.

అవినాష్‌ని పొట్ట గురించి అడిగింది. సినిమాకి అఖిల్ హీరో కాబట్టి అఖిల్ కటౌట్, మెహబూబ్ విలన్ కాబట్టి అతని కటౌట్ పెట్టారు. ఇక సొహైల్‌కి తోపు అని రాశారు. కాగా ఈ ఇంటర్వ్యూలో బాగా మాట్లాడిన వాళ్లకు అవార్డులివ్వమంటే అవినాష్, మోనాల్, సొహైల్‌లకు ఇచ్చింది. మొన్న కెప్టెన్సీ టాస్క్‌లో మోనాల్ హ్యాండ్ ఇచ్చినప్పటికీ.. అరియానా మాత్రం చాలా జెన్యూన్‌గా మోనాల్ పేరు చెప్పడం బాగా అనిపించింది.

Read More:

Bigg Boss 4: బీబీ స్టార్ అవార్డ్స్‌.. ఎవరెవరికి ఏ అవార్డు వచ్చిందంటే

Bigg Boss 4: నాగ్‌ లేకుండా వారాంతం షో.. ‘ప్రేమ మొదలైంది’ మూవీ అదిరిపోయింది