Bigg Boss 4: మోనాల్‌ని నామినేట్ చేశా.. గుండె భారంగా అనిపించింది
బిగ్‌బాస్ సండే ఫన్‌డే ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యులను బాగా ఎంటర్‌టైన్ చేశారు హోస్ట్ సమంత. ఇక కంటెస్టెంట్‌లకు మాట్లాడే అవకాశం రాగా
Akhil Monal Bigg Boss 4: బిగ్‌బాస్ సండే ఫన్‌డే ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యులను బాగా ఎంటర్‌టైన్ చేశారు హోస్ట్ సమంత. ఇక కంటెస్టెంట్‌లకు మాట్లాడే అవకాశం రాగా.. మోనాల్ ఎలిమినేషన్ నామినేషన్‌లో ఉన్నందుకు అఖిల్ తెగ ఫీలయ్యాడు. ఈ వారం ప్రారంభం నుంచి చాలా బాధపడుతున్నా. మోనాల్‌ని నామినేట్ చేశా. గుండె భారంగా ఉంది. నామినేషన్లు వచ్చినప్పుడు నాకు, మోనాల్‌కి పడింది. మేమిద్దరం క్లారిటీగానే ఉన్నాం. కానీ మోనాల్‌ని చేయాల్సి వచ్చింది.
అయితే నామినేషన్ల తరువాత చాలా మంది ఏం మాట్లాడారంటే నువ్వు నామినేషన్‌లో ఉండాల్సింది. సింపథీ వచ్చేది అని అన్నారు. కానీ నేను సింపథీ కోసం ఇక్కడకు రాలేదు. నాలాగే ఇక్కడ ఉండటానికి వచ్చా. ఇక్కడ కూడా నాలా లేకపోతే వేస్ట్’అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక అఖిల్ చెప్పిందంతా విన్న సమంత.. మరి మోనాల్ ఎలిమినేట్ అయితే నీ ఫీలింగ్ ఏంటి అని అడిగింది. అందుకు అఖిల్.. నాకు తెలిసి ఇవాళ ఎలిమినేషన్ ఉండదు. మోనాల్ ఎలిమినేట్ అవ్వదంటూ చెప్పేవాడు. సరే చూద్దామని చెప్పేసిన సమంత.. ఎలిమినేషన్ నుంచి మోనాల్‌ని సేవ్ చేసింది. దీంతో అఖిల్ ఊపిరి పీల్చుకున్నాడు.
Read More:
Bigg Boss 4: దివి ఔట్.. స్టేజ్‌పైనే సినిమా ఛాన్స్ ఇప్పించిన సమంత