దేవరగట్టు కర్రల సమరం టెన్షన్.!

కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం అధికారుల్లో టెన్షన్‌ క్రియేట్‌ చేస్తోంది. కరోనా నేపథ్యంలో విజయదశమి పండుగ తర్వాతిరోజు జరిగే బన్నీ ఉత్సవాలను ఈ ఏడాది పోలీసులు రద్దు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో 11 పోలీస్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అలూరు, హోలగొంద, హాలహర్వి మండలాలకు తిరిగే కర్ణాటక ఆర్టీసీ బస్సు సర్వీసులను ఈరోజు సాయంత్రం వరకు రద్దు చేశారు. అయితే, బన్నీ ఉత్సవాన్ని పోలీసులు రద్దు చేసినా… సంప్రదాయం కొనసాగించాల్సిందే అంటూ నిర్వాహకులు పట్టుబడుతున్నారు. దీంతో […]

  • Venkata Narayana
  • Publish Date - 7:41 am, Mon, 26 October 20

కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం అధికారుల్లో టెన్షన్‌ క్రియేట్‌ చేస్తోంది. కరోనా నేపథ్యంలో విజయదశమి పండుగ తర్వాతిరోజు జరిగే బన్నీ ఉత్సవాలను ఈ ఏడాది పోలీసులు రద్దు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో 11 పోలీస్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అలూరు, హోలగొంద, హాలహర్వి మండలాలకు తిరిగే కర్ణాటక ఆర్టీసీ బస్సు సర్వీసులను ఈరోజు సాయంత్రం వరకు రద్దు చేశారు. అయితే, బన్నీ ఉత్సవాన్ని పోలీసులు రద్దు చేసినా… సంప్రదాయం కొనసాగించాల్సిందే అంటూ నిర్వాహకులు పట్టుబడుతున్నారు. దీంతో దేవరగట్టులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. ఈసారి దేవరగట్టులో ఏం జరుగబోతోంది.? అనే అంశం టెన్షన్‌ క్రియేట్‌ చేస్తోంది. మరోవైపు మంత్రి జయరాంతో ఆదోని డీఎస్పీ, ఆర్డీవో భేటీ అయ్యారు. ఇవాళ జరిగే దేవరగట్టు కర్రల సమరంపై చర్చించారు. కర్రల సమరం జరగకుండా నియోజకవర్గ ప్రజలకు నచ్చచెప్పాలని మంత్రి జయరాంను కోరారు. లక్షల మంది జనం కలిస్తే మళ్లీ కరోనా విజృంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.