Bigg Boss 4: నా పేరూ ‘ఏ’తోనే స్టార్ట్ అవుతుంది: మోనాల్‌తో ఆది పులిహోర

బిగ్‌బాస్‌ 4 దసరా ఎపిసోడ్‌లో భాగంగా హైపర్ ఆది షోకు గెస్ట్‌గా వచ్చాడు. ఈ సందర్భంగా స్టేజ్‌పైన బాగానే రచ్చ చేశాడు. అలవాటులో భాగంగా

Bigg Boss 4: నా పేరూ 'ఏ'తోనే స్టార్ట్ అవుతుంది: మోనాల్‌తో ఆది పులిహోర
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 26, 2020 | 8:26 AM

Bigg Boss Hyper Aadi: బిగ్‌బాస్‌ 4 దసరా ఎపిసోడ్‌లో భాగంగా హైపర్ ఆది గెస్ట్‌గా వచ్చాడు. ఈ సందర్భంగా స్టేజ్‌పైన బాగా రచ్చ చేశాడు. అలవాటులో భాగంగా కంటెస్టెంట్‌లపై పంచులు విసిరాడు. అమ్మ రాజశేఖర్ అపరిచితుడని, సొహైల్‌ అర్జున్ రెడ్డిలా ఉండేవాడని, కానీ స్వాతి ముత్యంలా తయారయ్యాడని చెప్పుకొచ్చాడు. అంతేకాదు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నావు కాబట్టే టీవీలో ఉన్నావు. లేదంటే టీవీ ముందు ఉండేవాడివి అన్నాడు. దీంతో అందరూ నవ్వేశారు. ఇక మోనాల్‌ని చూస్తుంటే తన సొంత క్రష్‌లా అనిపిస్తుందని ఆమెతో పులిహోర కలిపేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు త‌న పేరు కూడా ‘ఏ’తో మొద‌ల‌వుతుంద‌ని అన్నాడు. వెంటనే సమంత మీరు హైపర్ ఆది కదా హెచ్‌ కదా అంటే.. మోనాల్‌ కోసం తీసేసుకోలేమా..? అండి అని నవ్వులు పూయించాడు.

ఇక మంచి మనుషులు కొంటె రాక్షసులు టాస్క్‌లో మెహబూబ్‌ మంచి మనిషిగా మారడం చూసిన తనకు ఆర్జీవీ శంకరాభరణంకు దర్శకత్వం వహించినట్లు అనిపించిందని అన్నారు. అఖిల్‌ ఎక్కువగా మోనాల్‌ దగ్గరే ఉంటాడని, దీని వలన ఎడిటర్లకు పని తక్కువవుతుందని తెలిపాడు. దీంతో హౌజ్‌మేట్స్ అందరూ నవ్వారు. దివిని చూస్తే తనకు ఖుషీలో భూమిక గుర్తు వస్తుందని అన్నారు. నోయల్‌ గురించి మాట్లాడుతూ.. ప్రపంచంలో ముగ్గురు మాత్రమే మంచివాళ్లు ఉన్నారు. ఒకరు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ప్రకాష్‌ రాజ్, మరొకరు బ్రహ్మోత్సవంలో సత్యరాజ్‌, ఇంకొకరు బిగ్‌బాస్ 4 హౌజ్‌లో నోయల్‌ అని పేర్కొన్నారు.

అరియానా ఆర్జీవీని కూడా ప్రేమలో పడేయగలదని ఫన్నీ కామెంట్లు చేశాడు. ఇక అభిజిత్‌ గురించి మాట్లాడుతూ.. హౌజ్‌లో మోనాల్‌ కోసం అఖిల్‌, అభి గొడవపడ్డప్పుడు ప్రేమ దేశం సినిమాలా అనిపించింది. కానీ ఇప్పుడు అభి ప్రేమ దేశం డైరెక్టర్ అయ్యాడు అని కామెంట్లు చేశాడు. హారిక, ప్రతిసారి బిగ్‌బాస్‌ దగ్గర కంప్లైన్ చేయడం చూస్తుంటే తనకు దూకుడు సినిమాలో బ్రహ్మానందం గుర్తు వస్తారని పేర్కొన్నాడు. ఇంట్లో అయినా సరే బయట అయినా సరే లాస్య చెప్పే జోకులు ఆమెను మాత్రమే నవ్విస్తాయని ఆది ఫన్నీగా అన్నాడు. ఇక చివరగా అవినాష్‌ గురించి మాట్లాడుతూ.. బాహుబలి మొదటి భాగం వచ్చినప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్న అందరిలో తలెత్తెంది. అయితే ఇప్పుడు అవినాష్‌ సోఫా మీద ఏం రాశాడు అని ఆలోచిస్తున్నారు అని కామెంట్లు చేశారు.

Read More:

Bigg Boss 4: మోనాల్‌ని నామినేట్‌ చేశా.. గుండె భారంగా అనిపించింది

Bigg Boss 4: మోనాల్‌ని నామినేట్‌ చేశా.. గుండె భారంగా అనిపించింది