Bigg Boss 4: కొత్త టాలెంట్ చూపించిన అఖిల్.. అందరూ ఇంప్రెస్
హౌజ్‌లోకి వెళ్లినప్పటి నుంచి మోనాల్‌కి దగ్గరయ్యేందుకే ఎక్కువగానే ప్రయత్నించిన అఖిల్, తాజాగా కొత్త టాలెంట్‌ని చూపించారు
Bigg Boss 4 Telugu: హౌజ్‌లోకి వెళ్లినప్పటి నుంచి మోనాల్‌కి దగ్గరయ్యేందుకే ఎక్కువగానే ప్రయత్నించిన అఖిల్, తాజాగా కొత్త టాలెంట్‌ని చూపించారు. సాక్షి దీక్షిత్ ఎంట్రీ తరువాత ఆమెను ఇంప్రెస్ చేసిన వారికి సర్‌ప్రైజ్ ఉంటుందని బిగ్‌బాస్ తెలిపాడు. దీంతో పలువురు తమలోని టాలెంట్‌ని బయటకు తీశారు. ఈ క్రమంలో అఖిల్ పాట పాడారు. అఖిల్‌లో అద్భుతమైన సింగర్ ఉన్నాడని అప్పుడే అందరికీ తెలిసింది. అతడి పాటకు ఇంప్రెస్ అయిన సాక్షి, ఓ రోజ్‌ని ఇవ్వగా.. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా వావ్ అని ప్రశంసలు కురిపించారు. ఇక అమ్మ రాజశేఖర్, నోయెల్ తరువాత పిలవకుండానే అవినాష్ రోజ్ తీసుకున్నాడు. ఆ నలుగురికి లాంజ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. వారందరూ బిగ్‌బాస్ అరేంజ్ చేసిన పార్టీని ఎంజాయ్ చేశారు. పార్టీ మంచి జోష్ ఉన్న సాంగ్స్‌తో అద్భుతంగా నడిచింది.
Read More:
Bigg Boss 4: సాక్షి దీక్షిత్ ఎంట్రీ.. పులిహోర స్టార్ట్ చేసిన అభిజిత్