Bigg Boss 4: సాక్షి దీక్షిత్ ఎంట్రీ.. పులిహోర స్టార్ట్ చేసిన అభిజిత్
బిగ్‌బాస్‌లోకి మరో బ్యూటీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. బుట్టబొమ్మ సాంగ్‌తో సాక్షి దీక్షిత్ హౌజ్‌లోకి రాగా.. అభిజిత్ ఆమెను తీసుకువెళ్లాడు.
Swathi Deekshith entry: బిగ్‌బాస్‌లోకి మరో బ్యూటీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. బుట్టబొమ్మ సాంగ్‌తో సాక్షి దీక్షిత్ హౌజ్‌లోకి రాగా.. అభిజిత్ ఆమెను తీసుకువెళ్లాడు. అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఆమె మాస్క్ తీశాడు. వెంటనే అభిజిత్, అవినాష్‌లు తమ పులిహోరను స్టార్ట్ చేశారు. అయితే అప్పుడే బిగ్‌బాస్ అసలు ట్విస్ట్ ఇచ్చాడు. స్వాతి అబ్బాయిలకు సర్‌ప్రైజ్ తెచ్చిందని, అది చెప్పాలంటే అందరూ ఆమెను మెప్పించాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు.
“అందం ఎలా ఉంటుందో నిన్ను చూశాకే తెలిసింది. ఆడుకునే బొమ్మ ప్రాణంతో ఉంటుందని ఇప్పుడే చూస్తున్నా” అంటూ అమ్మ రాజశేఖర్ కవిత్వం చెప్పాడు. ఆ తరువాత “నువ్వు నవ్వితే బాగుంటావు, నేను నీ తోడుంటే జీవితాంతం నవ్వుతూనే ఉంటావు. బుట్టబొమ్మ కాదు.. బాపు గీసిన బొమ్మవు నీవు. నీ పేరు స్వాతి దీక్షిత్. నీ కోసం ఎన్ని దీక్షలైనా చేయొచ్చు. మామూలుగా హీరోయిన్లు హీరోలకు పడిపోతారు. కానీ కమెడియన్లకు పడిపోరు. మాకు మనసుంటుంది” అని ప్రేమ వ్యాఖ్యలు పలికాడు అవినాష్.
కాగా స్వాతి రాగానే మోనాల్, దేత్తడి హారికలను వదిలిపెట్టిన అభిజిత్.. ఆమెతో పులిహోర స్టార్ట్ చేశాడు. దీంతో అవినాష్, గంగవ్వ, లాస్య, నోయల్, రాజశేఖర్ మాస్టర్, సుజాతలు అభిజిత్‌పై జోకులు వేసుకొని నవ్వుకున్నారు. ఇక సొహైల్, మొహబూబ్‌లు అయితే.. మనం టాస్క్‌లలో ఇరగదీస్తున్నాం గానీ, మిగిలిన వాళ్లు అమ్మాయిలతో కనెక్షన్ పెట్టుకుని గేమ్ ఆడుతున్నారు అంటే మాట్లాడుకున్నారు. ఇలాగే ఉంటే మనం బిస్కెట్టే అంటూ ఫీల్ అయ్యారు.
Read more: