బిగ్ బాస్ హౌస్‌‌లో ర్యాగింగ్.. బికినీ ధరించాలంటూ హుకుం!

Bigg Boss 14: విచిత్రమైన టాస్కులు, చిత్రమైన శిక్షలు, రొమాన్స్, యుద్దాలు, గొడవలకు కేర్ అఫ్ అడ్రస్ బిగ్ బాస్ . హిందీ బిగ్ బాస్‌లో అయితే హద్దులు మీరిన రొమాన్స్‌లు, మాటలకు కొదవ లేదు. తాజాగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్టుగా బిగ్ బాస్ సీజన్ 14 ప్రారంభమైంది. గత సీజన్లలా కాకుండా ఈ సీజన్‌ను షో నిర్వాహకులు కొంచెం వెరైటీగా ప్లాన్ చేశారు. గత సీజన్ల విన్నర్స్ అయిన హీనా ఖాన్, సిద్ధార్థ్ శుక్లా, […]

బిగ్ బాస్ హౌస్‌‌లో ర్యాగింగ్.. బికినీ ధరించాలంటూ హుకుం!
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 06, 2020 | 3:35 PM

Bigg Boss 14: విచిత్రమైన టాస్కులు, చిత్రమైన శిక్షలు, రొమాన్స్, యుద్దాలు, గొడవలకు కేర్ అఫ్ అడ్రస్ బిగ్ బాస్ . హిందీ బిగ్ బాస్‌లో అయితే హద్దులు మీరిన రొమాన్స్‌లు, మాటలకు కొదవ లేదు. తాజాగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్టుగా బిగ్ బాస్ సీజన్ 14 ప్రారంభమైంది. గత సీజన్లలా కాకుండా ఈ సీజన్‌ను షో నిర్వాహకులు కొంచెం వెరైటీగా ప్లాన్ చేశారు.

గత సీజన్ల విన్నర్స్ అయిన హీనా ఖాన్, సిద్ధార్థ్ శుక్లా, గౌహర్ ఖాన్‌లకు ఈ ఏడాది కంటెస్టెంట్ల సెలక్షన్‌ను అప్పజెప్పారు. అందులో భాగంగానే నలుగురు కంటెస్టెంట్లను ఈ ముగ్గురు తిరస్కరించారు. ఇక వాళ్లు హౌస్‌లోకి వెళ్లాలంటే.. మొదటి వారం ఈ సీనియర్లు ఇచ్చే టాస్కుల్లో ఖచ్చితంగా గెలవాలని బిగ్ బాస్ స్పష్టం చేశాడు. రిజెక్ట్‌డ్ కంటెస్టెంట్ల లిస్టులో రూబీనా దిలక్, నిశాంత్ సింగ్, జాన్ కుమార్ సోనూ, సారా గుర్‌పాల్ ఉన్నారు. వీరందరికీ కూడా సీనియర్లు టాస్కులు ఇచ్చారు.

మొదటి రౌండ్‌లో భాగంగా రూబీనాను వారం పాటు ఒకటే జతతో ఉండాలని.. నిశాంత్ సింగ్ తన టీ-షర్ట్‌పై బికినీ టాప్ వేసుకుని వారం పాటు తిరగాలని.. సారాను జుట్టును చిన్నగా కట్ చేసుకోవాలని.. జాన్ కుమార్ సోనూను 5 కేజీల వెయిట్ ఒక నిమిషం పాటు ఎత్తి పట్టుకోవాలని సీనియర్లు టాస్క్ ఇచ్చారు. దీనికి రూబీనా ఒప్పుకోకపోవడం.. ఆమె భర్త అభినవ్ శుక్లా మధ్యలో కలగజేసుకుని ఒప్పించడం జరిగింది.

అలాగే, సెకండ్ రౌండ్‌లో భాగంగా రూబీనాను ఒక నిమిషంలో మిర్చిలు తినాలని సీనియర్లు హుకుం జారీ చేయగా.. నిశాంత్‌ బికినీ టాప్ వేసుకోవడమే కాకుండా నుదిటిపై ‘రిజెక్ట్‌డ్’ అని రాసుకుని ఉండాలన్నారు. అలాగే జాన్‌ను విచిత్రంగా హెయిర్ కట్ చేసుకోమని.. సారాను వెయిట్ లిఫ్ట్ చేయాలని చెప్పారు. సారా, రూబీనా తప్పితే మిగిలిన కంటెస్టెంట్లు సీనియర్లు ఇచ్చిన టాస్కులను కంప్లీట్ చేశారు. ఇక రౌండ్ చివర్లో బిగ్ బాస్.. అత్యంత చెత్త ప్రదర్శన ఇచ్చిన కంటెస్టెంట్ ఎవరో ఎంపిక చేయాలని అడగగా.. అందరూ రూబీనాకి ఓటు వేయడంతో.. ఆమె తప్ప అందరూ కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ కావడం జరిగింది.