బిగ్ బాస్: అభిజిత్ సారీ చెప్పాడు.. మోనాల్ అఖిల్‌కు హగ్ ఇచ్చింది!
బిగ్ బాస్ 4లో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ పీక్స్‌కు చేరుకుందని చెప్పాలి. సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా అభిజిత్-అఖిల్ మోనాల్ కోసం కొట్టుకోవడం జరిగింది.
Bigg Boss 4: బిగ్ బాస్ 4లో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ పీక్స్‌కు చేరుకుందని చెప్పాలి. సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా అభిజిత్-అఖిల్ మోనాల్ కోసం కొట్టుకోవడం జరిగింది. దీనితో మోనాల్ మధ్యలో కలగజేసుకుని ‘ఇది నేషనల్ టెలివిజన్. మీ మధ్య గొడవ ఉంటే కూర్చుకుని మాట్లాడండి. నా పేరును మాత్రం మధ్యలో తీసుకొచ్చి క్యారెక్టర్ బ్యాడ్ చేయొద్దు’ అని రోదిస్తూ కన్నీరు పెట్టుకుంది.
అయితే ఆమె అంతలా ఏడ్చినా కూడా.. బిగ్ బాస్ చూపించే వీడియోలతో ఆ ముగ్గురి మధ్య లవ్ స్టోరీ రూమర్లు మాత్రం ఆగట్లేదు. ఇద్దరికీ క్లోజ్ అవుతున్న మోనాల్.. ఒకరికి తెలియకుండా ఒకరిని ఎంటర్టైన్ చేస్తోందని.. బయటికి వచ్చేసిన కంటెస్టెంట్లు అందరూ కూడా చెప్పారు. స్వాతీ అయితే మరో అడుగు ముందుకేసి అఖిల్- అభిజిత్ ఫీలింగ్స్‌తో మోనాల్ ఆడుకుంటోందని తెలిపింది. ఆట ఆడొచ్చు గానీ.. ఎమోషన్స్‌తో ఆడకూడదని ఓపెన్ అయింది. ఇదిలా ఉంటే ఈవారం నామినేషన్స్‌లో అభిజిత్-అఖిల్ బద్ద శత్రువులు మాదిరిగా మోనాల్ విషయంలో ఒకరిపై ఒకరు పగ పెంచుకుని మరీ గొడవపడ్డారు.
తాజాగా ఇవాళ్టి ఎపిసోడ్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఇందులో అభిజిత్ వెళ్లి మోనాల్‌కు సారీ చెప్పడం.. ‘నేను మాత్రం నీ టాపిక్‌ని రేజ్ చేయలేదు మోనాల్” అంటూ ఆమె కన్నీళ్లు తుడవడం జరిగింది. ఇక అఖిల్ ఎప్పటిలాగే మోనాల్‌తో గుసగుసలాడుతూ.. ‘వేరే అమ్మాయి దగ్గరకు వెళ్లి.. నీ గురించి అలా చెప్పడం తప్పు.. నేను అది అడిగితే.. నీకు వేరేలా అర్ధమైంది. బయటకు ఇంకో కోణంలో ప్రచారం అవుతోంది. నేను ఇంతిలా కొట్లాడుతున్నానంటే.. వేరు టాపిక్ దొరకక కాదు.. మస్త్ ఉన్నాయి’ అంటూ మోనాల్ కన్నీళ్లు తుడవగా.. ఎప్పటిలాగే మోనాల్ అఖిల్‌కు హగ్ ఇచ్చేసింది.
ఏది ఏమైన వీళ్ల ముగ్గురి మధ్య కొంచెం ఉంటే.. బిగ్ బాస్ దాన్ని పెద్ద సినిమాలా చేసి చూపిస్తున్నాడు. అలాగే అఖిల్‌తో అర్ధరాత్రి రొమాన్స్‌లు, అభికి ‘ఐ లైక్ యూ’.. నాగార్జున ‘నీ మనసులో ‘A’ ఉన్నాడంటే.. అవును అని చెప్పడం.. ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఇద్దర్ని ఎంటర్టైన్ చేస్తున్నట్లే ఉన్నాయి.