Bigg Boss 4: హౌజ్‌లో ‘ఓదార్పుల పర్వం’.. కూల్ అయిన కంటెస్టెంట్‌లు
సోమవారం నాటి ఎపిసోడ్‌లో నామినేషన్ సమయంలో బిగ్‌బాస్ హౌజ్‌లో పెద్ద యుద్ధమే జరిగిన విషయం తెలిసిందే. దీంతో తమను నామినేట్ చేసిన పలువురు కంటెస్టెంట్‌లు
Bigg Boss 4 Telugu: సోమవారం నాటి ఎపిసోడ్‌లో నామినేషన్ సమయంలో బిగ్‌బాస్ హౌజ్‌లో పెద్ద యుద్ధమే జరిగిన విషయం తెలిసిందే. దీంతో తమను నామినేట్ చేసిన పలువురు కంటెస్టెంట్‌లు బాగా హర్ట్ అయ్యారు. దీంతో నామినేషన్ తరువాత కూడా ఏడుపులు కొనసాగాయి. ఈ క్రమంలో మంగళవారం నాటి ఎపిసోడ్‌లో ఓదార్పుల పర్వం మొదలైంది. లాస్య ఏడుస్తుంటే గంగవ్వ ఓదార్చింది. నామినేషన్స్‌లో భాగంగా ‘నువ్వు చేసిన పప్పు తినడం వల్లే హౌస్‌లో అందరికీ మోషన్స్’ అని దివి చెప్పిన దానికి లాస్య ఓ రేంజ్‌లో హర్ట్ అయింది. తరువాత మోనాల్ ఏడుస్తుంటే లాస్య ఓదార్చింది. ఇంతలో అభిజిత్ వచ్చి మోనాల్‌ను ఓదార్చే బాధ్యతను తీసుకున్నాడు.
నేను నీ గురించి మాట్లాడలేదు అని చెప్పి అభి, మోనాల్‌ని ఓదార్చేందుకు యత్నించాడు. ‘నామినేషన్స్ నా గురించి కాదు.. మీకేమైనా ఇష్యూ ఉంటే మీరు మీరు మాట్లాడుకోండి’ అని చెప్పి ఏడ్చేసింది మోనాల్. ఇక అమ్మ రాజశేఖర్‌ను నోయెల్ నామినేట్ చేసిన దానికి బాగా ఫీలయ్యారు. దీంతో సొహైల్ వచ్చి ఓదార్చాడు. ఆ తరువాత మోనాల్, అభిలు మాట్లాడుకున్నారు. ‘నువ్వు ఐ లైక్ యూ అని చెప్పిన విషయాన్ని మరో అమ్మాయికి చెప్పడం నాకు నచ్చలేదు. అందుకే నీ మాట తీశానని’ వివరించి అఖిల్ కూల్ చేశాడు. దీంతో అతడిని హత్తుకొని బాధపడింది మోనాల్. ఆ తరువాత అమ్మ రాజశేఖర్, నోయెల్‌ల మధ్య చర్చ జరిగింది. తను నామినేషన్‌లో చేసిందానికి వివరణ ఇచ్చాడు నోయెల్. కానీ అమ్మ రాజశేఖర్ దాన్ని అస్సలు వినిపించుకోలేదు. నేనేమీ చిన్న పిల్లవాడిని కాదు. సినిమా డైలాగ్స్ వద్దు. ఫ్రాంక్‌గా ఉండమని నోయెల్‌కి అమ్మ రాజశేఖర్ క్లియర్‌గా చెప్పాడు. ఈ వారం నేను ఎలిమినేట్ అవ్వాలి. దాంతో నువ్వు జీవితాంతం బాధపడాలి అని అమ్మ రాజశేఖర్ మాస్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తానికి ఒక్కొక్కరి ఓదార్పుతో అందరూ కాస్త శాంతపడినట్లు తెలుస్తుండగా.. మాస్టర్ మాత్రం కూల్ అవ్వనట్లు తెలుస్తోంది.
Read More:
రేపే ‘జగనన్న విద్యా కానుక’, 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి