Bigg Boss 4: బీబీ హోటల్.. అవినాష్ తనకు ముద్దు పెట్టాలని చూశాడన్న అరియానా
ఎమోషనల్ ఫైట్‌తో హీటెక్కిన హౌస్‌ను బీబీ హోటల్ ద్వారా బిగ్‌బాస్ కూల్ చేశారు. ఆ తరువాత అవినాష్‌ని సీక్రెట్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు
Bigg Boss 4 task: ఎమోషనల్ ఫైట్‌తో హీటెక్కిన హౌస్‌ను బీబీ హోటల్ ద్వారా బిగ్‌బాస్ కూల్ చేశారు. ఆ తరువాత అవినాష్‌ని సీక్రెట్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. బీబీ హోటల్‌లో స్టాఫ్ ఛాలెంజ్‌లను, అతిథులకు అందించే సర్వీసులను పాడు చేయాలని అతడిని ఆదేశించాడు. అలాగే హోటల్ స్టాఫ్‌కు తక్కువ స్టార్లు వచ్చేలా చూడాలని చెప్పాడు. ఇక టాస్క్‌లో భాగంగా హోటల్ మేనేజర్‌గా అఖిల్, స్టాఫ్‌గా అభిజిత్, సెక్యూరిటీ అండ్ చెఫ్‌గా సుజాత, లాస్య. అసిస్టెంట్ చెఫ్ అండ్ వెయిటర్‌గా అమ్మ రాజశేఖర్, హౌస్ కీపింగ్‌గా నోయెల్, కుమార్, సర్వీస్ అండ్ స్పాగా దివి, మోనాల్, అసిస్టెంట్ మేనేజర్‌గా అవినాష్ వ్యవహరించారు. రిచ్‌మెన్లుగా మెహబూబ్, సోహైల్, హారిక, రాకుమారిగా అరియానా, ఆమె తల్లిగా గంగవ్వకు పాత్రలను ఇచ్చారు.
ఇక ఆట మొదలవగానే దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా అతిథులు హోటల్ సిబ్బందితో సేవలు చేయించుకున్నారు. మెహబూబ్ తనకు చికెన్ పకోడి కావాలంటే గంట, గంటన్నర పడుతుందని అభిజిత్ చెప్పాడు. నేను అరగంటలో చేస్తానని మెహబూబ్ అనగా, చేసుకోండి అని అభిజిత్ పంచ్ వేశాడు. తరువాతి రాకుమారి అరియానా, అవినాష్ తన చేయి పట్టుకున్నాడని మహారాణి గంగవ్వతో చెప్పడంతో కాలు మొక్కు అని అతడికి ఆర్డర్ వేసింది గంగవ్వ. ముద్దు పెట్టుకునేందుకు కూడా ప్రయత్నించారంటూ అరియానా చెప్పగా… చెంచాతో బకెట్ నింపమని అవినాష్‌కి శిక్ష వేసింది.
ఇక వారి ప్రవర్తనతో విసుగెత్తిపోయిన అవినాష్.. చిల్లరగా ప్రవర్తించకండి అంటూ రాకుమారిని విసుక్కున్నాడు. మధ్యలో సొహైల్ కలగజేసుకొని మాట్లాడేందుకు ప్రయత్నించాడు. దీంతో మీకు సంబంధం లేదంటూ అవినాష్ వేలు చూపించాడు. దీంతో రంగంలోకి దిగిన మేనేజర్ అఖిల్ అవినాష్‌ను కొట్టినట్లు చేసి పక్కకు తీసుకెళ్లాడు. రాత్రి కావస్తున్నా ఒక్కరు కూడా స్టార్ ఇవ్వకపోవడంతో మాస్టర్ సొహైల్ చిర్రెత్తిపోయాడు. తమతో అన్ని చేయించుకుని కనీసం టిప్పు కూడా ఇవ్వట్లేదని ముఖం మాడ్చుకున్నాడు. కానీ అభిజిత్ అతిథులను మెప్పించి, 5 స్టార్లను వాళ్లకు తెలియకుండానే కొట్టేశాడు. అటు అవినాష్ కూడా ఎవరికీ ఏ అనుమానం రాకుండా హోటల్ స్టాఫ్‌లకు ఏ టిప్పూ, స్టార్ రాకుండా ఆటను చెడగొడుతున్నాడు. ఈ గేమ్ ఈ రోజు కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
Read More:
Bigg Boss 4: హౌజ్‌లో ‘ఓదార్పుల పర్వం’.. కూల్ అయిన కంటెస్టెంట్‌లు
రేపే ‘జగనన్న విద్యా కానుక’, 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి