Bigg Boss 4: ఆ టాస్క్ అఖిల్ కొంప ముంచిందా..!
బిగ్‌బాస్ 4లో ఐదో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్ పూర్తైంది. నామినేషన్ల సమయంలో హౌజ్‌లో చిన్నపాటి యుద్ధమే జరిగింది
Bigg Boss 4 Akhil: బిగ్‌బాస్ 4లో ఐదో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్ పూర్తైంది. నామినేషన్ల సమయంలో హౌజ్‌లో చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ క్రమంలో ఐదోవారం నామినేషన్స్‌లో అఖిల్, నోయెల్, అభిజిత్, సొహైల్, రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానాలు నిలిచారు. అయితే ఈ ఎలిమినేషన్‌లో ఎక్కువ మంది అఖిల్‌ని నామినేట్ చేశారు. అరియానా, అవినాష్, సుజాత, రాజశేఖర్ మాస్టర్, హారిక, అభిజిత్‌లు అఖిల్‌ను ఎంపిక చేశారు. ఇందులో చాలా మంది ఒకే కారణం చెప్పారు. అదేంటంటే లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో అఖిల్ తీరు తమకు నచ్చలేదని చెప్పారు. ఈ టాస్క్‌లో అఖిల్, తనకు సన్నిహితంగా ఉన్న వారికి మాత్రమే షాపింగ్ చేశాడని, మిగిలిన వారికి చేయలేదని ఆరోపించారు. మొత్తానికి ఈ టాస్క్ అఖిల్ కొంప ముంచినట్లు స్పష్టమైంది. ఇక అభిజిత్, హారికలు గత వారంలోనే అఖిల్‌ని నామినేట్ చేయాలని ముందే అనుకున్న విషయం తెలిసిందే.
Read More:
Bigg Boss 4: నా పరువును తీయకండి.. మోనాల్ ఆవేదన
Bigg Boss 4: హాట్‌హాట్‌గా నామినేషన్ల ప్రక్రియ.. కంటెస్టెంట్‌ల మధ్య మాటల యుద్ధం