వైల్డ్ కార్డ్‌తో.. హౌస్‌లోకి తమన్నా సీక్రెట్ ఎంట్రీ!
‘బిగ్ బాస్’ 3 మొదలైన వారం రోజుల్లోనే ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలిరోజు నుంచే గొడవలు పడడం.. మాటల యుద్దాలు.. ఏడుపులు ఇలా అనేకం జరగడంతో షో అప్పుడే సోషల్ మీడియాలో సంచలనమవుతోంది. అలాగే మొదటి ఎలిమినేషన్‌లో అనుకున్నట్లుగానే నటి హేమ ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. అటు బిగ్ బాస్ ప్రేక్షకులకు ట్విస్ట్ ఇస్తూ.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎలిమినేషన్ అయిన రోజునే మరొకరిని లోపలి […]
‘బిగ్ బాస్’ 3 మొదలైన వారం రోజుల్లోనే ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలిరోజు నుంచే గొడవలు పడడం.. మాటల యుద్దాలు.. ఏడుపులు ఇలా అనేకం జరగడంతో షో అప్పుడే సోషల్ మీడియాలో సంచలనమవుతోంది. అలాగే మొదటి ఎలిమినేషన్‌లో అనుకున్నట్లుగానే నటి హేమ ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. అటు బిగ్ బాస్ ప్రేక్షకులకు ట్విస్ట్ ఇస్తూ.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎలిమినేషన్ అయిన రోజునే మరొకరిని లోపలి పంపించాడు. ఇక ఆ ఎంట్రీ కూడా తెలుగు రాష్ట్రాల్లోని అందరికీ సుపరిచితురాలైన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి కావడం విశేషం.
హౌస్‌లోకి ఎంటర్ అవుతూ స్టేజిపై తమన్నా మాట్లాడుతూ.. తన కల నెరవేరిందని.. ట్రాన్స్‌జెండర్‌ను అయినా తనకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అన్నారు. హౌస్‌లో తానేంటో నిరూపించుకుంటానని.. చివరి వరకు ఉంటానని ఆమె ధీమాగా చెప్పారు.
ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున.. తమన్నా పేరు ప్రస్తావించినప్పటికీ.. కొద్దిరోజులు సీక్రెట్‌గా ఉంచి.. హౌస్‌లోకి పంపుతారని అందరూ భావిస్తే.. సోమవారం ఎపిసోడ్‌లోనే ఎంటర్ చేశారు. ఇక ఇందుకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా ఇప్పటికే విడుదల చేసింది. తమన్నా ఎంట్రీతో లోపల ఉన్న కంటెస్టెంట్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే తమన్నా మాత్రం ‘పిక్చర్ ఔర్ బాకీ హై దోస్త్’ అనే డైలాగుతో ప్రేక్షకులకు కిక్కు ఇచ్చిందని చెప్పవచ్చు.