బిగ్ బాస్-13 షో లో మరో వివాదం.. ఇది ‘ జిహాద్ ‘ కాక మరేమిటంటూ నెటిజన్ల ఆగ్రహం

బిగ్ బాస్ షో ఒకసారి కాదు.. ఎన్నోసార్లు వివాదాల్లో చిక్కుకుంటోంది. తాజాగా. ఇటీవల (గతవారాంతం) సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ప్రారంభమైన బిగ్ బాస్-13 షో కి సంబంధించిన వ్యవహారమిది.. హౌస్ లో కంటెస్టెంట్లకు వింత టాస్క్ ఇచ్చాడు. బిగ్ బాస్.. మహిళా కంటెస్టెంట్లు.. పురుష కంటెస్టెంట్లతో బెడ్ షేర్ చేసుకోవాలన్నదే అది ! అంతే ! ఇక దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ వెల్లువయింది. ఈ ఉదంతాన్ని ‘ జిహాద్ ‘ పేరిట హ్యాష్ ట్యాగ్ […]

బిగ్ బాస్-13 షో లో మరో వివాదం.. ఇది ' జిహాద్ ' కాక మరేమిటంటూ నెటిజన్ల ఆగ్రహం
Follow us
Anil kumar poka

|

Updated on: Oct 07, 2019 | 5:24 PM

బిగ్ బాస్ షో ఒకసారి కాదు.. ఎన్నోసార్లు వివాదాల్లో చిక్కుకుంటోంది. తాజాగా. ఇటీవల (గతవారాంతం) సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ప్రారంభమైన బిగ్ బాస్-13 షో కి సంబంధించిన వ్యవహారమిది.. హౌస్ లో కంటెస్టెంట్లకు వింత టాస్క్ ఇచ్చాడు. బిగ్ బాస్.. మహిళా కంటెస్టెంట్లు.. పురుష కంటెస్టెంట్లతో బెడ్ షేర్ చేసుకోవాలన్నదే అది ! అంతే ! ఇక దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ వెల్లువయింది. ఈ ఉదంతాన్ని ‘ జిహాద్ ‘ పేరిట హ్యాష్ ట్యాగ్ పోస్ట్ చేసేంతవరకూ వెళ్ళింది. కాశ్మీర్ కు చెందిన ఆసిమ్ రియాజ్ అనే బ్రాహ్మణ కంటెస్టెంట్ ను ముస్లిం కంటెస్టెంట్ తో బెడ్ షేర్ చేసుకోవాలని కోరడమేమిటని అనేకమంది నెటిజన్లు ప్రశ్నించారు. ఇది నిజానికి ‘ జిహాద్ ‘ అనే వారు పేర్కొన్నారు. అలాంటి ‘ వ్యవస్థను ప్రమోట్ చేయడమేనన్నారు. అందుకే ఈ షో ను బహిష్కరించాలని కొందరు కోరితే.. ఇది చీప్ షో.. ఈ విధమైన షో లు అసభ్య చిత్రాలకు తీసిపోవు అని మరికొంతమంది చీదరించుకున్నారు. సనాతన ధర్మానికి వీళ్ళు చేటు తెస్తున్నారని, మన భారతీయ సంస్కృతిని దెబ్బ తీయవద్దని మరికొంతమంది ట్వీట్లు చేశారు. ఇంకా ఇలాగే చాలామంది ఈ షో ను దుయ్యబట్టారు.

అయితే.. కాస్త వెనక్కి వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేస్తే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఇమేజీ ఇప్పటిది కాదట.. ఇది బిగ్ బాస్-9 షో లోని ఓల్డ్ ఎపిసోడ్ అని, ఇది ఆ స్క్రీన్ షాట్ అని స్పష్టమైంది. సూయాష్ రాజ్, కిశ్వర్ మర్చెంట్ అనే నాటి ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటికి వచ్చాక.. పెళ్లి చేసుకుని దంపతులయ్యారని తెలిసింది. పైగా ఇది 2015 నాటి వారి ఇంటిమేట్ క్లిప్ అన్న విషయం తెలిశాక నెటిజన్లంతా ‘ నాలుక కరచుకుంటున్నారు ‘.