బిగ్ బాస్ విజేతను తేల్చేసిన గూగుల్.. ఎవరంటే?

అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే ఆదివారం జరగనుంది. ఇందులో టైటిల్ విన్నర్ ఎవరనేది అనౌన్స్ చేస్తారు. అయితే దాని కంటే ముందే గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలుస్తాడని ప్రకటించేశాయి. ప్రస్తుతం మిస్‌డ్ కాల్స్, హాట్‌స్టార్ యాప్ ద్వారా ఓటింగ్ ప్రాసెస్ కొనసాగుతోంది. ఇది శుక్రవారం అర్ధరాత్రితో ముగిస్తుంది. ఇదంతా పూర్తయిన తర్వాతే షో నిర్వాహకులకు విన్నర్ ఎవరనేది తెలుస్తుంది.. ఇక ఆదివారం మెగాస్టార్ […]

బిగ్ బాస్ విజేతను తేల్చేసిన గూగుల్.. ఎవరంటే?
Ravi Kiran

|

Nov 01, 2019 | 11:11 PM

అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే ఆదివారం జరగనుంది. ఇందులో టైటిల్ విన్నర్ ఎవరనేది అనౌన్స్ చేస్తారు. అయితే దాని కంటే ముందే గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలుస్తాడని ప్రకటించేశాయి.

ప్రస్తుతం మిస్‌డ్ కాల్స్, హాట్‌స్టార్ యాప్ ద్వారా ఓటింగ్ ప్రాసెస్ కొనసాగుతోంది. ఇది శుక్రవారం అర్ధరాత్రితో ముగిస్తుంది. ఇదంతా పూర్తయిన తర్వాతే షో నిర్వాహకులకు విన్నర్ ఎవరనేది తెలుస్తుంది.. ఇక ఆదివారం మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిధిగా విచ్చేసి విజేతను ప్రకటిస్తారు.

ఇదిలా ఉంటే గూగుల్‌లో ”Bigg Boss Telugu 3 Winner’ అని టైప్ చేస్తే.. రాహుల్ సిప్లిగంజ్ అంటూ దర్శనమిస్తోంది. ఇక రాహుల్ ఫ్యాన్స్ ఇది చూసి థ్రిల్ ఫీల్ అయ్యి. ప్రచారంగా ఉపయోగించుకుంటున్నారు.
అసలెందుకు గూగుల్ రాహుల్ సిప్లిగంజ్‌ను విన్నర్ అని చూపించిందంటే…
ముందస్తు సర్వేల ద్వారా పలు వెబ్‌సైట్స్ టైటిల్ విన్నర్ ఎవరనేది ఊహించి.. ఆర్టికల్స్‌ను ప్రచురించాయి. ఇక ఆ అనధికారిక పోల్స్ అన్నింటిలోనూ రాహుల్ ముందంజలో ఉండటం విశేషం. కాబట్టి గ్రాండ్ ఫినాలే ఆదివారం ప్రసారం కాబోతున్నా.. ఇన్ని ఆర్టికల్స్ వల్ల గూగుల్ కాస్తా కన్ఫ్యూజ్ అయింది.

ఏది ఏమైనా రాహుల్‌ను గెలిపించడానికి అతని ఫ్యాన్స్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మిగిలిన కంటెస్టెంట్లకు, రాహుల్‌కు మధ్య వ్యత్యాసం ఏంటో వ్యూయర్స్‌కు తెలియజేస్తూ.. ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే వరుణ్, రాహుల్, శ్రీముఖిల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారో వేచి చూడాలి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu