బిగ్ బాస్‌లో “పైసల గోల”.. నటిపై కేసు నమోదు
బిగ్ బాస్ ఫేమ్ నటి మధుమితపై తమిళనాడులో కేసు నమోదైంది. “బిగ్ బాస్” రియాల్టీ షోలో నటించినందుకు బాకీ ఉన్న పారితోషికాన్ని ఇవ్వాలని బెదిరించిందంటూ.. నటి మధుమితపై విజయ్ టీవీ మేనేజర్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న మధుమిత ఆత్మహత్యకు యత్నించడంతో ఆమెను కార్యక్రమం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులకు టీవీ మేనేజర్ ప్రసాద్ బుధవారం మధుమితపై ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ […]
బిగ్ బాస్ ఫేమ్ నటి మధుమితపై తమిళనాడులో కేసు నమోదైంది. “బిగ్ బాస్” రియాల్టీ షోలో నటించినందుకు బాకీ ఉన్న పారితోషికాన్ని ఇవ్వాలని బెదిరించిందంటూ.. నటి మధుమితపై విజయ్ టీవీ మేనేజర్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న మధుమిత ఆత్మహత్యకు యత్నించడంతో ఆమెను కార్యక్రమం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులకు టీవీ మేనేజర్ ప్రసాద్ బుధవారం మధుమితపై ఫిర్యాదు చేశారు.
బిగ్ బాస్ షోలో పాల్గొన్న మధుమిత బయటకు వెళ్లే సమయంలో ఒప్పందం ప్రకారం రూ.11.5 లక్షల పారితోషికం ఇచ్చామని ప్రసాద్ తెలిపారు. అయితే మిగతా డబ్బుని ఒప్పందం ప్రకారం 42 రోజుల్లో ఇచ్చేస్తామని తెలిపామన్నారు. రెండు రోజుల్లో ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ తనను ఫోన్లో బెదిరించారని.. అందువల్లే ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు.