AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“రాళ్లే రత్నాలు” టాస్క్‌: ఓవరాక్షన్ చేయకు అంటూ.. వితికాని తిట్టిన వరుణ్..!

బిగ్ బాస్ ఫైనల్‌కు ఇంకొక్క నెల రోజులు మాత్రమే ఉండటంతో.. ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. రోజురోజుకి సరికొత్త టాస్క్‌లతో బిగ్ బాస్.. ఇంటి సభ్యులను ఓ ఆట ఆడిస్తున్నాడు. ఈ వారం బిగ్ బాస్ ఇంటిసభ్యులకు నామినేషన్ టాస్క్ ఇవ్వడంతో పాటు కొన్ని షరతులు విధించాడు. ఇందులో భాగంగా కెప్టెన్‌ శ్రీముఖి తప్ప మిగతావారంతా ఇంట్లోకి వెళ్లకుండా గార్డెన్‌ ఏరియాలోనే ఉండాల్సి ఉంటుంది. ఈ వారం నామినేషన్ లో భాగంగా రాళ్లే రత్నాలు అనే టాస్క్ ఇచ్చారు […]

రాళ్లే రత్నాలు టాస్క్‌: ఓవరాక్షన్ చేయకు అంటూ.. వితికాని తిట్టిన వరుణ్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 01, 2019 | 5:13 PM

Share

బిగ్ బాస్ ఫైనల్‌కు ఇంకొక్క నెల రోజులు మాత్రమే ఉండటంతో.. ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. రోజురోజుకి సరికొత్త టాస్క్‌లతో బిగ్ బాస్.. ఇంటి సభ్యులను ఓ ఆట ఆడిస్తున్నాడు. ఈ వారం బిగ్ బాస్ ఇంటిసభ్యులకు నామినేషన్ టాస్క్ ఇవ్వడంతో పాటు కొన్ని షరతులు విధించాడు. ఇందులో భాగంగా కెప్టెన్‌ శ్రీముఖి తప్ప మిగతావారంతా ఇంట్లోకి వెళ్లకుండా గార్డెన్‌ ఏరియాలోనే ఉండాల్సి ఉంటుంది. ఈ వారం నామినేషన్ లో భాగంగా రాళ్లే రత్నాలు అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. వర్షం రూపంలో వచ్చిన విలువైన రాళ్లను సేకరించి తమ ఖాతాలో జమచేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా రాళ్లను సేకరించేందుకు కంటెస్టెంట్లు పోటీ పడ్డారు.

అయితే ఈ రోజు జరిగిన ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వరుణ్, వితికలు గొడవపడ్డారు. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో తక్కువ విలువైన రాళ్లను సేకరించిన రాహుల్ ఈ వారం ఎలిమినేషన్‌లోకి వచ్చాడు. ఈ ఈరోజు ఎపిసోడ్‌లో మరికొంత మంది నామినేషన్ జోన్‌లోకి రాబోతున్నారు. ఇక సోషల్ మీడియాలో విడుదలైన ప్రోమోలో వరుణ్, వితికాకి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాళ్లను తీసుకునే ప్రయత్నంలో వితికా, బాబా భాస్కర్‌పై ఫైర్ అవుతోంది. రాళ్లను తీసుకెళ్తూ బాబా పొరపాటున వితికాను తోయడంతో.. తను వచ్చి వరుణ్ పై పడింది. దీంతో వరుణ్ మూతికి దెబ్బతగిలింది. చూసుకుని ఆడొచ్చు కదా.. ఎందుకు మీద పడుతున్నారు అని అరిచింది.

హలో ఎందుకు అరుస్తున్నావ్.. ఆడితే ఆడు లేకపోతే పక్కకు జరుగు. గేమ్ అన్న తరువాత ఫిజికల్ టచ్ అవుతుంది. నీ మీద పడతారు. నా మీద కూడా పడ్డారు నేను నీలా అరిచానా..? ఎందుకు ప్రతి దానికి పెద్ద వింత చేస్తావు అంటూ క్లాస్ తీసుకున్నాడు. దీంతో ఆపేయ్ బాబు అంటూ వితికా చెవులు మూసుకున్నట్లు ప్రోమోలో కనిపిస్తోంది.

Follow Us