బిగ్ బాస్: ఇంటి సభ్యులకు షాక్.. “కుండ” బద్దలు కొట్టిన శ్రీముఖి
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సక్సస్ ఫుల్‌గా ముందుకెళుతోంది. రోజు రోజుకి కొత్త కొత్త టాస్క్‌లతో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు. ఒక టాస్క్‌లో అందరి మధ్య గొడవలు పెడుతూ.. మరో టాస్క్‌తో అందరూ కలిసిపోయేలా చేస్తున్నాడు. బిగ్ బాస్ ఇంట్లో ప్రతిరోజు ఏ సాంగ్ తో అయితే రోజు మొదలవుతుందో.. సాంగ్‌కు సంబంధించిన టాస్క్‌లే పెడుతుంటాడు బిగ్ బాస్. అలాగే గురువారం నాటి ఎపిసోడ్‌లో హో సైరా అనే […]

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సక్సస్ ఫుల్‌గా ముందుకెళుతోంది. రోజు రోజుకి కొత్త కొత్త టాస్క్‌లతో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు. ఒక టాస్క్‌లో అందరి మధ్య గొడవలు పెడుతూ.. మరో టాస్క్‌తో అందరూ కలిసిపోయేలా చేస్తున్నాడు. బిగ్ బాస్ ఇంట్లో ప్రతిరోజు ఏ సాంగ్ తో అయితే రోజు మొదలవుతుందో.. సాంగ్‌కు సంబంధించిన టాస్క్‌లే పెడుతుంటాడు బిగ్ బాస్. అలాగే గురువారం నాటి ఎపిసోడ్‌లో హో సైరా అనే ఎమోషనల్ సాంగ్‌తో రోజు మొదలైంది. పాటకు తగ్గట్టుగానే ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా సాగింది.
కెమెరాలు చుట్టూ ఉన్నా కూడా ఇంటి సభ్యులు గుసగుసలు ఆడుతూ ఉంటారు. అక్కడివి ఇక్కడ ఇక్కడికి అక్కడ చర్చించుకుంటూ ఉంటారు. అయితే “టాస్క్ హంట్ అండ్ హిట్” టాస్క్‌తో వారి బండారాన్ని బిగ్ బాస్ బయటపెట్టేశాడు. టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఓ బూత్‌ను ఏర్పాటు చేసి.. అందులో ఇంటి సభ్యులకు సంబంధించిన వీడియోలను ప్లే చేసి చూపించాడు.
అయితే ఆ వీడియోలో తమ గురించి మాట్లాడిన వ్యక్తిని గార్డెన్ ఏరియాలోకి పిలిచి వారితో ఆ సంభాషణ గురించి చర్చించిన తరువాత.. వారి ఫోటోను కుండకు అతికించి దిష్టిబొమ్మకు పెట్టి కర్రతో పగలగొట్టాల్సి ఉంటుంది. అయితే ముందుగా బాబా భాస్కర్ ను పిలిచి.. తన గురించి వరుణ్, వితికా, రాహుల్, అలీ, మహేష్‌లు మాట్లాడుకున్న సంభాషణను ప్లే చేసి చూపించారు. అది చూసిన బాబా.. అలీని బయటికి పిలిచి దాని గురించి చర్చించిన తర్వాత అలీ ఫోటోను కుండకు అతికించి.. దిష్టి బొమ్మకు తగిలించి కర్రతో బద్దలు కొట్టి తన కసిని తీర్చుకున్నాడు. తరువాత శ్రీముఖి వెళ్లింది. తన గురించి అలీ, శివజ్యోతి, మహేష్‌లు మాట్లాడుకున్న సంభాషణను విన్న శ్రీముఖి.. నీ అక్కా అంటూ అలీని పిలిచి క్లాస్ పీకింది. ఇక మహేష్ విషయానికి వస్తే చర్చించకుండానే కుండను రాములమ్మలా ఓ రేంజ్ లో పగలగొట్టి తన కోపాన్ని ప్రదర్శించింది. ఇలా అందరూ టాస్క్‌ను కంప్లీట్ చేశారు.
కాసేపు అలా సాగిన బిగ్ బాస్ ఎపిసోడ్ చివరికి.. బిగ్ బాస్ బర్త్ డే సందర్భంగా అందరూ డ్యాన్స్ చేస్తూ.. పార్టీ చేసుకుని ఎంజాయ్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఇది కూడా టాస్క్‌లో భాగమే అని చెప్పడంతో అందరూ ఓ రేంజ్‌లో చెలరేగిపోయారు. టాస్క్‌లో భాగంగా సాంగ్ ప్లే కాగానే.. పిచ్చిగా డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేశారు. తరువాత కేక్ కట్ చేసి తిన్నారు. బిగ్ బాస్ మళ్లీ మళ్లీ కేకులు పంపించడంతో.. కేకు మీద విరక్తి కలిగింది అంటూ ఇంటి సభ్యులు డీలా పడ్డారు. ఇక నేటి ఎపిసోడ్‌లో మరింత ఎంటర్ టైన్ మెంట్ ఉండబోతోంది.



