బిగ్ బాస్: ఎలిమినేషన్‌లో ముగ్గురు మొనగాళ్లు!

బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా పదకొండు వారాలు పూర్తి చేసుకుని పన్నెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ‘సేఫ్ పార్కింగ్’ అనే టాస్క్ ఇచ్చాడు. దీనిలో భాగంగా కేటాయించిన ఏడు పార్కింగ్ స్థలాల్లో ఒక్కొక్కరు తమ ట్రాలీని పార్క్ చేయాలి.. ఎవరైతే సేఫ్‌గా పార్కింగ్ చేయలేకపోతారో.. వారు ఈ వారం ఎలిమినేషన్స్‌కు నేరుగా నామినేట్ అవుతారు. అలా పార్కింగ్‌ స్థలాలను తగ్గిస్తూ ఉండటంతో.. ఒక్కొక్కరు నామినేట్‌ అవుతారు. మొత్తం […]

  • Updated On - 5:19 am, Tue, 8 October 19
బిగ్ బాస్: ఎలిమినేషన్‌లో ముగ్గురు మొనగాళ్లు!

బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా పదకొండు వారాలు పూర్తి చేసుకుని పన్నెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ‘సేఫ్ పార్కింగ్’ అనే టాస్క్ ఇచ్చాడు. దీనిలో భాగంగా కేటాయించిన ఏడు పార్కింగ్ స్థలాల్లో ఒక్కొక్కరు తమ ట్రాలీని పార్క్ చేయాలి.. ఎవరైతే సేఫ్‌గా పార్కింగ్ చేయలేకపోతారో.. వారు ఈ వారం ఎలిమినేషన్స్‌కు నేరుగా నామినేట్ అవుతారు. అలా పార్కింగ్‌ స్థలాలను తగ్గిస్తూ ఉండటంతో.. ఒక్కొక్కరు నామినేట్‌ అవుతారు. మొత్తం నాలుగు రౌండ్లు పాటు ఈ టాస్క్ జరగ్గా తొలి రౌండ్‌లో వరుణ్, రెండో రౌండ్‌లో వితికా, మూడో రౌండ్‌లో మహేష్, నాలుగో రౌండ్‌లో రాహుల్‌లు నామినేషన్‌లోకి వెళ్లారు.

అయితే వితికా బ్యాటిల్ ఆఫ్ ది మెడాలియన్ విజేత కావడంతో ఈ నామినేషన్ నుంచి తనకున్న ప్రత్యక్ష అధికారంతో ఎస్కేప్ అయ్యింది. దానితో ఈ వారం మహేష్ విట్టా, వరుణ్, రాహుల్‌లలో ఒకరు ఇంటి నుంచి బయటికి వెళ్ళబోతున్నారు. మరోవైపు ఇప్పటికే చాలామంది నెటిజన్లు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే డబుల్ ఎలిమినేషన్ కావాలని బిగ్ బాస్‌ను అడుగుతున్నారు. చూడాలి మరి వీకెండ్ లోపు ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది.