బిగ్ బాస్ షోకి శాపాలుగా మారిన లోపాలు

తెలుగు బిగ్ బాస్‌ షో ఫైనల్‌కి చేరువలో ఉంది. మొదటి రెండు సీజన్ల కంటే.. మూడో సీజన్‌కి ఊహించనంతగా అభిమానులు పెరిగిపోయారు. దీనికితోడు ప్రేక్షకులు తమకు నచ్చిన వారికి ఓట్లు వేసే అవకాశం ఉండటంతో.. ఈ షోకు మరింత ఆదరణ పెరిగింది. అయితే బిగ్ బాస్ సీజన్ 3కి క్రేజ్ ఎంత ఉందో.. విమర్శలు కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయి. బిగ్ బాస్ షో లో కొన్ని లోపాలు ఉన్నాయని అందుకే విమర్శలు వస్తున్నాయని టాక్ నడుస్తోంది. […]

బిగ్ బాస్ షోకి శాపాలుగా మారిన లోపాలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 08, 2019 | 10:24 AM

తెలుగు బిగ్ బాస్‌ షో ఫైనల్‌కి చేరువలో ఉంది. మొదటి రెండు సీజన్ల కంటే.. మూడో సీజన్‌కి ఊహించనంతగా అభిమానులు పెరిగిపోయారు. దీనికితోడు ప్రేక్షకులు తమకు నచ్చిన వారికి ఓట్లు వేసే అవకాశం ఉండటంతో.. ఈ షోకు మరింత ఆదరణ పెరిగింది. అయితే బిగ్ బాస్ సీజన్ 3కి క్రేజ్ ఎంత ఉందో.. విమర్శలు కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయి.

బిగ్ బాస్ షో లో కొన్ని లోపాలు ఉన్నాయని అందుకే విమర్శలు వస్తున్నాయని టాక్ నడుస్తోంది. మొదటిది ఓటింగ్ ప్రక్రియ రహస్యమే అయినప్పటికీ.. ఎపిసోడ్ కంటే ముందుగానే ఎవరికి తక్కువ ఓటింగ్స్ వచ్చాయి.. ఎవరు సేఫ్ లిస్ట్‌లో ఉన్నారు అనేది ముందే తెలిసిపోతుంది. అంతేకాదు ఈ సీజన్‌కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించడం కూడా మరో మైనస్ పాయింట్‌గా తెలుస్తోంది. ఒకప్పుడు బిగ్ బాస్ షో పై విమర్శలు చేసిన.. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారని తెలిసినప్పుడు దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది.

ఇక మొదటి రెండు సీజన్లలో ఇంటి సభ్యులు అందరూ ఏ టాస్క్‌లు ఇచ్చినా ఒకే గ్రూపుగా ఆడేవారు. ఒకరికి ఒకరు సపోర్టు చేసుకునేవారు. ఇంటి సభ్యుల మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేంది. కాని సీజన్ 3లో ఎవరికి వారే ఆడుతున్నారు. ఎపిసోడ్ ప్లే అవ్వకముందే.. సోషల్ మీడియాలో ప్రోమోలు చక్కర్లు కొడుతున్నాయి. రేటింగ్ కోసమే.. బిగ్ బాస్ నిర్వాహకులు లీక్ చేస్తున్నారని.. ప్రోమో ముందే చూసేస్తే ఇంకా థ్రిల్ ఏముంటుందని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.

అలాగే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ముందే ఎలిమినేట్ అవ్వడం.. వీక్ కంటెస్టెంట్లు హౌస్‌లో కొనసాగడం పై విమర్శలు వస్తున్నాయి. ఏ టాస్క్‌లోనూ యాక్టివ్‌గా కనిపించని పునర్నవి 11 వారాల పాటు హౌస్‌లో నెట్టుకొచ్చింది. ఇందుకు రాహుల్, పునర్నవి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని.. వీరిద్దరూ ఇంట్లో ఉంటే మరింత రేటింగ్ వచ్చే అవకాశం ఉందని ఎలిమినేషన్ విషయంలో కూడా బిగ్ బాస్ తప్పుగా వ్యవహరిస్తున్నారని టాక్ నడుస్తోంది.

మరొకటి తెలుగు షోలో తమిళ సెలెబ్రిటీని తీసుకోవడం పట్ల బిగ్ బాస్ నిర్వహకులపై విమర్శలు వచ్చాయి. తెలుగులో ఎంతో మంది సెలెబ్రిటీలు ఉండగా.. తమిళనాడుకు చెందిన వ్యక్తిని తీసుకోవడం ఏంటని పలువురు ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ కూడా చేశారు. కానీ, హౌస్‌లో అతడి తీరును చూసి అంతా తమ అభిప్రాయాలను మార్చుకున్నారు.