నా భార్యకు క్యాన్సర్.. అందుకే సినిమాలకు దూరం

బిగ్‌బాస్-2 తెలుగు సీజన్‌ యాక్టర్ కౌశల్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎవరేమనుకున్నా.. నేను ఇలానే ఉంటానంటూ.. బిగ్‌బాస్-2 సీజన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అప్పట్లో.. కౌశల్ ఆర్మీ అని.. పెద్ద హంగామా కూడా జరిగింది. కాగా.. బిగ్‌బాస్ షో నుంచి కౌశల్.. బయటకు వచ్చాక సినిమాలు, సీరియళ్లతో బిజీగా ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ.. కౌశల్ అప్పటి నుంచి ఇప్పటి వరకూ.. ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. ఇదేంటని.. అటు నెటిజన్లు.. సోషల్ మీడియాలో.. ఇటు.. కౌశల్‌ను […]

నా భార్యకు క్యాన్సర్.. అందుకే సినిమాలకు దూరం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 24, 2019 | 3:46 PM

బిగ్‌బాస్-2 తెలుగు సీజన్‌ యాక్టర్ కౌశల్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎవరేమనుకున్నా.. నేను ఇలానే ఉంటానంటూ.. బిగ్‌బాస్-2 సీజన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అప్పట్లో.. కౌశల్ ఆర్మీ అని.. పెద్ద హంగామా కూడా జరిగింది. కాగా.. బిగ్‌బాస్ షో నుంచి కౌశల్.. బయటకు వచ్చాక సినిమాలు, సీరియళ్లతో బిజీగా ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ.. కౌశల్ అప్పటి నుంచి ఇప్పటి వరకూ.. ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. ఇదేంటని.. అటు నెటిజన్లు.. సోషల్ మీడియాలో.. ఇటు.. కౌశల్‌ను సూటిగానే ప్రశ్నిస్తున్నారు.

ఈ వార్తలపై స్పందించిన కౌశల్.. అసలు నిజం బయటపెట్టాడు. ‘తన భార్య నీలిమ.. క్యాన్సర్‌తో బాధపడుతోందని.. అందుకే నేను తనతో ఉంటూ.. ఆమెను సంతోషంగా.. ఉంచుతున్నానని’ పేర్కొన్నాడు. ఈ వార్తను తానే స్వయంగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

https://www.instagram.com/p/B0MHO7Wlf0U/