శ్రీముఖి ఆర్మీ: ఎలిమినేట్ చేస్తే సెట్ కాల్చేస్తాం..!

‘బిగ్ బాస్’ సీజన్ 3 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ రియాలిటీ షో చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా.. నిర్వాహకులు అనుకున్న సమయానికే ప్రారంభించారు. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఆదివారం ఈ షో ప్రారంభం కాగా.. అదే రోజు 15 మంది ‌కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. అంటే మరుసటి రోజు నుంచి హౌస్‌లో రచ్చ మొదలైంది. దీనికి కారణం ఆ వారం ఎలిమినేషన్స్‌కు నామినేషన్స్ జరగడమే. నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొదటి రోజే ‘బిగ్ బాస్’ ఆరుగురు సభ్యులను […]

శ్రీముఖి ఆర్మీ: ఎలిమినేట్ చేస్తే సెట్ కాల్చేస్తాం..!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 24, 2019 | 3:54 PM

‘బిగ్ బాస్’ సీజన్ 3 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ రియాలిటీ షో చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా.. నిర్వాహకులు అనుకున్న సమయానికే ప్రారంభించారు. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఆదివారం ఈ షో ప్రారంభం కాగా.. అదే రోజు 15 మంది ‌కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. అంటే మరుసటి రోజు నుంచి హౌస్‌లో రచ్చ మొదలైంది. దీనికి కారణం ఆ వారం ఎలిమినేషన్స్‌కు నామినేషన్స్ జరగడమే.

నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొదటి రోజే ‘బిగ్ బాస్’ ఆరుగురు సభ్యులను ఎలిమినేషన్స్‌లో నామినేట్ చేశాడు. అయితే ఈ ప్రక్రియలో మానిటర్ హేమను మెప్పించే విధంగా తమ గురించి తాము చెప్పుకుని, మరొకరిని తమ బదులుగా నామినేట్ చేయవచ్చని బిగ్ బాస్ ఆదేశించాడు. అదీ కూడా ఐదుగురికే అవకాశం కల్పించాడు.

బెల్ మ్రోగిన తర్వాత మొదట రాహుల్.. శివజ్యోతిని ఎంపిక చేయడం జరిగింది. అయితే అతను చెప్పిన కారణాలు హేమకు నచ్చకపోవడంతో.. రాహుల్‌నే నామినేట్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత వరుణ్ సందేశ్.. పునర్విని ఎంపిక చేయగా.. హేమ దానికి అంగీకరించింది. ఆ తర్వాత వితిక.. అషురెడ్డిని చేసినా.. లాభం లేకపోయింది. ఇక తర్వాత శ్రీముఖి.. హిమజను చేసింది. చివరిగా జాఫర్.. మహేష్ విట్టాను చేయగా.. దానికి హేమ ఒప్పుకోకపోవడంతో.. జాఫర్ ఎలిమినేషన్‌కు వచ్చాడు. ఇకపోతే బాబా భాస్కర్.. ఒక్కడే మిగిలిపోయేసరికి.. ‘బిగ్ బాస్’ హేమ, బాబా భాస్కర్‌ ఇద్దరిలో ఎవరిని నామినేట్ చేయాలనీ హౌస్ మెంబెర్స్‌ను అడగ్గా.. అందరూ కూడా హేమనే నామినేట్ చేశారు. దీంతో ఈ వారం పునర్వి, వితిక, హిమజ, జాఫర్, రాహుల్,హేమ ఎలిమినేషన్స్‌లో ఉన్నారు.

ఇది ఇలా ఉండగా మానిటర్ హేమకు, హిమజకు మధ్య ఈ ప్రక్రియలో చిన్న వాగ్వాదం జరిగింది. దానితో హిమజ ఏడ్వడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

అటు కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టకముందే.. సోషల్ మీడియాలో వారి పేరు మీద ఆర్మీలు రెడీ అయిపోయాయి. ఇక శ్రీముఖి ఫ్యాన్స్ అయితే షో ప్రారంభమైయ్యే పది రోజుల ముందు నుంచి నెట్టింట్లో హడావుడి మొదలు పెట్టారు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్లో కొందరు ‘శ్రీముఖి ఆర్మీ’ అని ఒక గ్రూపును కూడా క్రియేట్ చేసి.. ఆమెకు సపోర్ట్ చేస్తూ పోస్టు‌లు పెడుతున్నారు. అంతేకాకుండా హౌస్‌లో శ్రీముఖిని ఎవరైనా వ్యతిరేకిస్తే.. వారిని విమర్శిస్తూ మేమెస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘శ్రీముఖిని ఎలిమినేట్ చేస్తే.. బిగ్ బాస్ సెట్ కాల్చేస్తాం’ అంటూ కొందరు మీమ్స్ క్రియేట్ చేయగా.. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

ఏది ఏమైనా షో స్టార్ట్ అయిన మూడు రోజుల్లోనే హౌస్‌లో గొడవలు, రొమాన్స్‌లు, మాటల యుద్ధాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!